అంతర్జాతీయం

నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 6: భారత్-పాక్ నియంత్రణ రేఖ వద్ద ఆదివారం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన ప్రజలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారత రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ-కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకెఎల్‌ఎఫ్) అధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. అయితే నియంత్రణ రేఖ దాట రాదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం నిరసనకారులను హెచ్చరించారు. నియంత్రణ రేఖ దాటినట్లయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని ఆయన సూచించారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతూ ఎండగడుతున్నామని ఆయన చెప్పారు. జేకెఎల్‌ఎఫ్ నాయకుడు రఫీఖ్‌దార్ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామని తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద భారత్, పాక్‌కు చెందిన ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేపట్టినట్లయితే ఇరు దేశాల సైనికులు అమాయక ప్రజలపై కాల్పులు జరపరాదని కోరారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఇలాఉండగా జేకెఎల్‌ఎఫ్ నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా కొంత మంది ఆందోళనకారులు అధీన రేఖ దాటి ముందుకెళ్ళే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే సైనిక అధికారులు వారిని వారించి వెనక్కి పంపించారు.