అంతర్జాతీయం

పాక్‌లో కలకలం రేపుతున్న మహిళల పరువు హత్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 6: ఇది అత్యంత హృదయ విదారకరమైన ఘటన. పాకిస్తాన్‌లో సోషల్ మీడియా సెలబ్రిటీ క్వండీల్ బలోచ్‌ను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న ఆమె సోదరు న్ని ఇంటర్‌పోల్ సహకారంతో పోలీసులు అరెస్టు చేసి పంజాబ్ ప్రావిన్స్‌కు అప్పగించారు. కాగా, పాక్‌లో ప్రతి ఏడాది వెయ్యి మంది వరకు మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు. సొంత కుటుంబ సభ్యులో, బంధువులో ఈ పరువు హత్యలకు పాల్పడుతున్నారు. పరువు హత్యల నిరోధించేందుకు పాక్ ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నప్పటికీ హత్యలు ఆగడం లేదు. క్వండీల్ బలోచ్ హత్యతో మరోసారి కలకలం రేగి, చర్చనీయాంశమైంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్ ప్రాంతంలో సోషల్ మీడియా నిర్వహిస్తున్న క్వండీల్ బలోచ్‌గా గుర్తింపు పొందిన పౌజియా 2016 సంవత్సరం జూలై 15న దారుణంగా హత్యకు (చిల్లింగ్ మర్డర్) గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలాఉండగా పరారీలో ఉన్న బలోచ్ సోదరుడు మహ్మద్ ఆరిఫ్‌ను ఇంటర్ పోల్ సహాయంతో అరెస్టు చేసి ముల్తాన్ ప్రాంతంలోని ముజఫరాబాద్ పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు సీనియర్ పోలీసు అధికారి మహర్ బషీర్ హిరాజ్ మీడియాకు వెల్లడించారు. బలోచ్ హత్యతో సంబంధం ఉన్న మరో సోదరుడు మహ్మద్ వాసిమ్‌కు ఇదివరకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సోషల్ మీడియాలో తమకు నచ్చని పోస్టింగులు పెడుతూ, కుటుంబ ప్రతిష్టను మంటగలిపినందుకే 26 ఏళ్ళ సోదరిని హత్య చేసినట్లు శిక్ష పడిన వాసిమ్ తెలిపారు.
*చిత్రం... పోలీసులకు చిక్కిన క్వండీల్ బలోచ్ హంతకుడు (ఇన్‌సెట్‌లో) మృతురాలు క్వండీస్ ఫైల్ ఫొటో