అంతర్జాతీయం

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల బరిలో సిరిసేన లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 6: శ్రీ లంక అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల బరిలో ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన లేరు. ఈ ఏడాది నవంబర్ 16న జరగబోయే ఎన్నికలకు దాఖలైన డిపాజిట్లలో సిరిసేన డిపాజిట్ చేయడంలో విఫలమయ్యారు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అనాసక్తత కనబరిచారు. పోటీ చేసే అభ్యర్థులు నగదు డిపాజిట్లు దాఖలు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి 41 మంది అభ్యర్థులు డిపాజిట్లు చేసి బరిలో నిలిచారు. అయితే ఈ 41 మందిలో సిరిసేన పేరు లేదు. వీరు సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా 41 మంది అధ్యక్ష పదవి బరిలో ఉన్నారని ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు. 1982 సంవత్సరం నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధ్యక్ష పదవికి దాఖలైన డిపాజిట్లలో ప్రధాని రాణేల్ విక్రమ సింఘే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర రాజపక్సేగానీ లేరు. ఇలాఉండగా అధ్యక్షుడు రాజపక్సే శనివారం రాత్రి ప్రతిపక్ష నాయకుడు రాజపక్సేతో మంతనాలు జరిపారు. గోటభాయ రాజపక్సే అభ్యర్థిత్వాన్ని బలపరచాలని సిరిసేన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో అధికార యూఎన్‌పీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాసకు సవాల్‌గా మారింది. ఇలాఉండగా రాజపక్సే పీపుల్స్ పార్టీ ఎన్నికల చిహ్నమైన పూల మొగ్గను వదిలి సాధారణ చిహ్నంపై పోటీ చేయడానికి ముందుకు రావాలని సిరిసేన ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పి) సూచించింది.