అంతర్జాతీయం

ఉత్తర కొరియా, అమెరికా మధ్య మళ్లీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, అక్టోబర్ 5: ఉత్తర కొరియా, అమెరికా మధ్య అణ్వస్త్రాలపై చర్చల పునరుద్ధరణకు శనివారం రంగం సిద్ధమయింది. కొన్ని నెలల పాటు స్తంభించిన చర్చల ప్రక్రియ తిరిగి ఇప్పుడు స్టాక్‌హోమ్‌లో ప్రారంభం అవుతోంది. ఉత్తర కొరియా ఈ వారంలోనే సముద్ర తీరం నుంచి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన తరువాత ఈ చర్చలు ప్రారంభం కానుండటం విశేషం. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ మ్యోంగ్, గిల్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూత స్టీఫెన్ బెగన్ స్టాక్‌హోమ్‌లో చర్చలు జరిపే ఇరు దేశాల ప్రతినిధి బృందాలలో ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.00 గంటలు దాటిన తరువాత తొలి కార్లు స్టాక్‌హోమ్‌కు చేరుకోవడం ప్రారంభమయింది. ఉత్తర కొరియా తరచుగా చర్చలు జరిపే భాగస్వామిపై ఒత్తిడి కొనసాగించడానికి దౌత్య మార్గాలతో పాటు సైనికపరమయిన చర్యలను కూడా ఉపయోగించుకుంటోందని విశే్లషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ఉత్తరకొరియాను బలీయం చేస్తోందని అనేక మంది విశే్లషకులు పేర్కొంటున్నారు. అమెరికాతో వర్కింగ్-లెవల్ చర్చల పునరుద్ధరణకు సిద్ధమని ప్రకటించిన తరువాత కూడా ఉత్తర కొరియా బుధవారం ‘సూపర్-లార్జ్’ రాకెట్‌ను పరీక్షించింది. ఉత్తర కొరియా అణునిరాయుధీకరణపై ఇలాంటి చర్చలే స్టాక్‌హోమ్‌లో 2018 మార్చిలో, ఈ సంవత్సరం జనవరిలో జరిగాయి. కిమ్ మ్యోంగ్ గిల్ స్టాక్‌హోమ్‌కు వస్తూ మార్గమధ్యంలో బీజింగ్‌లో మాట్లాడుతూ చర్చల పట్ల ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉన్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హనోయిలో జరిగిన భేటీ అనంతరం చర్చల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. ఆగిపోయిన ఈ చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు అమెరికా ఎంతో ఆతృతతో వేచి చూస్తూ వచ్చింది.