అంతర్జాతీయం

బాగ్దాద్‌లో పగటి పూట కర్ఫ్యూ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, అక్టోబర్ 5: ఇరాక్ ప్రభుత్వం శనివారం బాగ్దాద్‌లో పగటి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. అయితే ఆందోళనకారులు ఘోరమైన నిరసనలకు దిగే ప్రమాదం ఉందన్న అనుమానంతో ప్రధాన రహదారులన్నీ మూసి ఉంచింది. గత ఐదు రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
బాగ్దాద్‌లో, దక్షిణ ఇరాక్‌లోని పట్టణాల్లో సామూహిక నిరసనల కారణంగా మరణించిన వారి సంఖ్య 73కు పెరిగింది. ఐదు రోజులుగా జరుగుతున్న ఆందోళనలతో మూడు వేలకు పైగా ప్రజలు గాయపడ్డారు. తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సమస్య, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లిప్తత, అవినీతిని నిర్మూలించలేక పోవడం వంటి పలు అంశాలపై ప్రజలు ఆందోళనలకు దిగారు.
మంగళవారం నుంచి ఇప్పటి వరకు 540 మంది ఆందోళనకారులను అరెస్టు చేయడం జరిగిందని కమిషన్ పేర్కొంది. ఇలాఉండగా ఉదయం 5 గంటల నుంచి పగటి పూట కర్ఫ్యూను ఎత్తివేయాల్సిందిగా ప్రధాని అదెల్ అబ్దుల్ మహది ఆదేశాలు జారీ చేశారు. దీంతో వ్యాపారులు దుకాణాలను తెరిచారు. కూరగాయాలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు రోడ్లపైకి రావడంతో సందడిగా మారాయి. ఔషధాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకైనా పగటి పూట కర్ఫ్యూ ఎత్తి వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.