అంతర్జాతీయం

ద్వైపాక్షిక చర్చలతోనే సమస్యలకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 3: చైనాసహా వివిధ పొరు దేశాలతో బలమైన స్నేహ బంధాన్ని కోరుకుంటున్నట్టు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. చైనాసహా పొరుగు దేశాలన్నింటితోనూ చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటామని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు భారత్ అన్ని విధాలా కృషి చేస్తున్నదని ది హెరిటేజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జైశంకర్ అన్నారు. చైనాతో వివిధ దేశాలకు వివిధ సమస్యలు ఉన్నట్టు ఆయన తెలిపారు. భారత్ మాత్రం చైనాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఓ ప్రశ్నపై స్పందిస్తూ చైనాతో కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు, సమస్యలు ఉన్న విషయం నిజమేనని అన్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే భారత్ లక్ష్యమని అన్నారు. 5జీ సమాచార అంశాన్ని తాము రాజకీయ కోణంలో చూడడం లేదన్నారు. నిజానికి అది టెలికామ్‌కు సంబంధించిందని జైశంకర్ వ్యాఖ్యానించారు. దీనిపై సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ‘మా పొరుగున్న దేశాల్లో అత్యంత ప్రధానమైనది, అత్యంత పెద్దది చైనా. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఆ దేశంతో మాకు చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అవి ప్రతిసారీ సత్సంబంధాలే అయివుండాన్న నిబంధన ఏదీ లేదు. అయితే, చైనాతో మేము స్నేహ బంధాన్ని కోరుకుంటున్నాం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం’ అన్నారు.

*చిత్రం... భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్