అంతర్జాతీయం

శాంతికి దిక్సూచి మహాత్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, అక్టోబర్ 3: పర్యావరణ విధ్వంసం మొదలుకొని సాయుధ ఘర్షణల వరకు వివిధ రూపాలలో హింస పెచ్చరిల్లుతున్న పరిస్థితుల్లో మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, స్థిరమయిన అభివృద్ధి వంటి బోధనలు నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరిస్ అన్నారు. ఐరాసకు చెందిన నాయకులు గాంధీజీ తీసుకొచ్చిన ‘పరివర్తనా మార్పు’ను స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతికి చిహ్నంగా నిలిచిన మహాత్మా గాంధీ 150వ జయంతి రోజయిన అక్టోబర్ రెండో తేదీన అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు గుటెరిస్ పేర్కొన్నారు. ‘హింస అనేక రూపాలను సంతరించుకుంది. విధ్వంస ప్రతికూల పరిణామమయిన పర్యావరణ అత్యయిక పరిస్థితి నుంచి సాయుధ ఘర్షణల కారణంగా చోటు చేసుకుంటున్న వినాశనం వరకు, పేదరికం కారణంగా గురవుతున్న అవమానాల నుంచి మానవ హక్కుల ఉల్లంఘనల అన్యాయం వరకు, విద్వేష ఉపన్యాసాల క్రూరమయిన ప్రభావాల వరకు హింస అనేక రూపాలలో ఉంది’ అని గుటెరిస్ నేడు ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ‘అతని (గాంధీ) దూరదృష్టి, బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పరస్పర అవగాహన, సమానత్వం, స్థిరమయిన అభివృద్ధి, యువత సాధికారత, వివాదాలకు శాంతియుత పరిష్కారాల కోసం ఐరాస పనివిధానంలోనూ ఆయన విలువలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి’ అని గుటెరిస్ అక్టోబర్ రెండో తేదీన జరుపుకుంటున్న ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవ’ సందేశంలో పేర్కొన్నారు. ఐరాసలో భారతదేశ పర్మనెంట్ మిషన్ ‘క్లైమేట్ యాక్షన్: గాంధియన్ వేస్’ అనే అంశంపై గాంధీజీ జ్ఞాపకార్థం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస జనరల్ అసెంబ్లీ 74వ సెషన్ అధ్యక్షుడు టిజ్జాని మహమ్మద్ బండే కీలకోపన్యాసం చేస్తూ ఐరాసకు దాదాపు ప్రతి ఒక్కటి వౌలికమయినదేనని అన్నారు. ఐరాస తన పనివిధానంలో గాంధీజీ జీవితం, ఆలోచనావిధానాలను అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘గాంధీజీ గురించి ఏదైనా కొత్తది చెప్పడం కష్టం. ప్రపంచంలో ఎక్కడయినా గాంధీజీ ఆలోచన, సంకల్పమయిన అహింస గురించి ప్రభావితం కాని పాఠశాల విద్యార్థి ఎవరయినా ఉన్నారని నేను అనుకోవడం లేదు’ అని ఆయన అన్నారు.

*చిత్రం... ఐరాస సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరిస్