అంతర్జాతీయం

భారత్ దాడిచేస్తే తిప్పికొడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 3: భారత్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా తగినవిధంగా బదులివ్వడానికి పాకిస్తాన్ బలగాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా అన్నారు. కాశ్మీర్‌ను ఆయన పాకిస్తాన్ ‘కంఠసిర’గా అభివర్ణించారు. గురువారం జరిగిన కాప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ పూర్తి సన్నద్ధంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ గౌరవం, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవాలనే నిబద్ధతను కలిగి ఉందని ఆయన అన్నారు. ‘కాశ్మీర్ పాకిస్తాన్ కంఠసిర. ఈ అంశంపై ఎలాంటి రాజీ సమస్యే లేదు’ అని ఆయన నొక్కి చెప్పారు. భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.