అంతర్జాతీయం

యుద్ధం పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 3: అమెరికాతో చర్చలు జరిపి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశాన్ని జారవిడుచుకోవద్దని అఫ్గనిస్తాన్ తాలిబన్లకు పాకిస్తాన్ హితబోధ చేసింది. యుద్ధమన్నది ఏ సమస్యకు పరిష్కారం కాదని, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ తాలిబన్ నేతలకు స్పష్టం చేశారు. తాలిబన్లతో చర్చలకు స్వస్తి పలుకుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆకస్మిక ప్రకటనతో శాంతి చర్చల ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ ఆ ప్రక్రియను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా తాలిబన్ నేతలతో పాక్ విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. తాలిబన్ రాజకీయ కమిషన్ అధినేత ముల్లా అబ్దుల్ ఘనీ బర్దార్ సారథ్యంలో ఈ బృందం ఖురేషీతో సమావేశమైంది. అఫ్గాన్, పాకిస్తాన్ మధ్య చారిత్రకంగా ఎంతో సన్నిహిత బంధం ఉందని, భౌగోళికంగా సాంస్కృతికంగా కూడా ఈ రెండు దేశాలూ ఉమ్మడి చరిత్రను పంచుకుంటూ వచ్చాయని తాలిబన్ నేతలకు ఖురేషీ స్పష్టం చేశరా. స్నేహ పూర్వకంగా ఉంటున్న ఈ రెండు దేశాలకు ఇస్లాం మతం బలమైన బంధమని చెప్పారు. అమెరికా చేపట్టిన శాంతి చర్చలను పునరుద్ధరించి వాటిని లక్ష్యానికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అఫ్గాన్‌లో శాంతియుత పరిస్థితుల స్థాపనకు లభించిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని, సాధ్యమైనంత త్వరగానే దీన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని తెలిపారు. గత నెలలో కాబూల్‌లో అమెరికా సైనికుడి హత్య నేపథ్యంలో తాలిబన్లతో చర్చలు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ప్రయత్నాల నేపథ్యంలో ఈ చర్చలు మళ్లీ ప్రారంభం కావాలన్న ఆశాభావాన్ని ఖురేషీ వ్యక్తం చేశారు. అఫ్గాన్ సమస్యకు సైనిక పరిష్కారం లేదని, శాంతియుతంగా నివృత్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.