అంతర్జాతీయం

హాంకాంగ్‌లో భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, అక్టోబర్ 2: హాంకాంగ్‌లో ఒక ఆందోళనకారుడిపై పోలీసులు కాల్పులు జరిపినందుకు నిరసనగా బుధవారం ఆకస్మికంగా ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు నాటకీయంగా ఉద్ధృతమయి హింసాత్మక అశాంతికి దారితీసిన పరిస్థితుల్లో ఒక టీనేజీ ఆందోళనకారుడు అధికారులపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ పోలీసు కాల్పులపై ఆగ్రహం చెందిన ప్రజలు బుధవారం అకస్మాత్తుగా ర్యాలీలు నిర్వహించారు. షర్ట్‌లు, సూట్‌లు ధరించిన కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు సహా కొన్ని వేల మంది ఆందోళనకారులు ఒక పార్క్‌లో సమావేశమయి, అనంతరం అక్కడి నుంచి నగరంలోని వాణిజ్య జిల్లా మీదుగా ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకన్నా కొన్ని గంటల ముందు వందలాది మంది విద్యార్థులు ఒక పాఠశాల ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న 18 ఏళ్ల త్సంగ్ చికిన్, మరికొందరు తమ ముఖాలకు మాస్కులు ధరించి గొడుగులు, బొంగులతో అధికారులపై దాడి చేశారు. దీంతో పోలీసులు త్సంగ్ చికిన్ ఛాతీలో కాల్పులు జరిపారు. సుమారు నాలుగు నెలల నుంచి ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు కొనసాగిస్తున్న హింసాయుత ఆందోళన కార్యక్రమాలలో ఒక ఆందోళనకారుడిపై పోలీసులు లైవ్ తూటాతో కాల్పులు జరపడం ఇదే మొదటిసారి. చైనాలో కమ్యూనిస్టుల పాలన మొదలయి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో భారీ మిలిటరీ పరేడ్ జరుగుతున్న సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఘర్షణలు జరిగాయి.