అంతర్జాతీయం

పాక్ చేరుకున్న అమెరికాలోని అఫ్గాన్ ప్రత్యేక రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 2: పాకిస్తాన్‌తో శాంతి చర్చల పునరుద్ధరణకు అఫ్గనిస్తాన్ శ్రమిస్తోంది. ఇందులో భాగంగా అమెరికాలోని అఫ్గన్ ప్రత్యేక రాయబారి జల్మె ఖలీల్‌జాద్ మంగళవారం పాక్‌కు చేరుకున్నారు. పాకిస్తాన్‌లోని ముఖ్యమైన నాయకులను కలుసుకోవడంతో పాటు తాలిబన్ బృందం సహ వ్యవస్థాపకుడు, శాంతి చర్చల మధ్యవర్తి ముల్లా అబ్దుల్ ఘని బారాదర్‌తో సమావేశమవుతారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన ముగించుకుని వెనుదిరిగిన రెండు రోజుల తర్వాత ప్రత్యేక రాయబారి ఖలీల్‌జాద్ పాక్‌కు చేరుకోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కలుసుకున్న తర్వాత న్యూయార్క్‌లో ఇమ్రాన్‌తో ఖలీల్‌జాద్ కూడా విడిగా సమావేశమై చర్చించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ (యూఎన్‌జీఏ) సమావేశంలో పాల్గొనేందుకు ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. తాలిబన్లతో శాంతి చర్చలు తిరిగి ప్రారంభించే విషయంలో ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.
ఇలాఉండగా అమెరికా-తాలిబన్లు ముసాయిదా శాంతి ప్రణాళిక విషయంలో ఒక అంగీకారానికి వచ్చినా, గత నెలలో కాబుల్‌లో అమెరికన్ సైనికున్ని కాల్చి చంపడం పట్ల ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ హత్య తామే చేశామంటూ తాలిబన్లు ప్రకటించడంతో తాను ఆశ్చర్యపోయానని ట్రంప్ పేర్కొన్నారు. అఫ్గన్ - తాలిబన్ల శాంతి చర్చలకు బ్రేక్ పడింది. తాలిబన్లు ఈ విధమైన ప్రకటన చేయడంతో అఫ్గన్ అధ్యక్షు డు అశ్రఫ్ ఘనితో తాలిబన్లు వాషింగ్టన్‌లో జరపాల్సిన రహాస్య చర్చలను రద్దు చేశారు. శాంతి చర్చలను తిరిగి గాడీలో పెట్టేందుకు ముల్లా బారాదర్ నేతృత్వంలో అఫ్గన్ తాలిబన్ బృందం బుధవారం పాక్‌కు చేరుకున్నట్లు తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ బృం దం పాక్ అధికారులతో చర్చిస్తుందని అధికార ప్రతినిధి సుహేల్ షాహీన్ సోషల్ మీడియాకు చెప్పారు.