అంతర్జాతీయం

భారత రాయబారికి పాక్ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 2: భారత్-పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని పాక్ ఆరోపిస్తూ, భారత దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించిన భారత దేశ సైనికులు నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరపడంతో తమ దేశానికి చెందిన ఓ మహిళ మృత్యువాత పడ్డట్లు పాక్ ఆ సమన్‌లో పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఇస్లామాబాద్‌లోని భారత దేశ డిప్యూటీ హై-కమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు బుధవారం డైరెక్టర్ జనరల్ (సౌత్ ఏషియా-సార్క్) మహ్మద్ ఫైసల్ సమన్ జారీ చేసినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. పాక్ సైనిక దళా ల నుంచి ఎటువంటి కవ్వింపు చర్చలు లేనప్పటికీ భారత దేశ సైనికులు అనవసరంగా కాల్పులు జరిపారని, దీంతో 50 ఏళ్ళ మహిళ నూర్ జహన్ మృతి చెందారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధిగా కూడా ఉన్న ఫైసల్ తెలిపారు. భారత సైనికులు తమ దేశంలోని సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నదని ఆయన ఆరోపించారు. జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత ఇరు దేశాల నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.