అంతర్జాతీయం

భారత్ నిర్ణయంపై బంగ్లాలో ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 2: ఉల్లి ఎగుమతులను భారత్ నిషేధించడంపై బంగ్లాదేశ్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల కొరత ఏర్పడడంతో ఉల్లి ధర అమాంతంగా పెరిగిపోయింది. దీంతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ఆసియాలో ఉల్లి ధర సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. చివరకు రాజకీయ అస్థిరతకు కూడా కారణం అవుతోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కేవలం ఉల్లి ధర పెరగడం వల్లనే కూలిపోయిన దృష్టాంతాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న ఉల్లి డిమాండ్‌కు ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో దిగుమతులు అత్యవసరమయ్యాయి. వివిధ దేశాల నుంచి బంగ్లా ప్రభుత్వం ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి అధిక మొత్తంలో వస్తోంది. భారత్‌లో ఉల్లి ధర పెరగడంతో ఆందోళనకు గురైన మోదీ సర్కారు తక్షణ నివారణ చర్యలను చేపట్టింది. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించింది. అదే సమయంలో ఉల్లి ఎగుమతులను నిషేధించింది. ఈ నిర్ణయం మిగతా దేశాలపై ప్రభావం ఎలావున్నా బంగ్లాదేశ్ మాత్రం తీవ్రమైన కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితిని గమనించిన బంగ్లా సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. మయన్మార్, టర్కీ, చైనా, ఈజిప్టు తదితర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. అయితే, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనుకోవడం అత్యాశ అవుతుంది. తాత్కాలికంగానైనా, ప్రస్తుతం ఏర్పడిన ఉల్లి కొరత ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. భారత ప్రభుత్వంపై బంగ్లా ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి హఠాత్ నిర్ణయాలు పలు సమస్యలు సృష్టిస్తాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.