అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 28: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనే సహించేది లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా, కలిసికట్టుగా అడుగులు ముందుకేస్తామని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 74వ సమావేశాల్లో పాల్గొన్న మోదీ ఆతర్వాత షేక్ హసీనా సహా వివిధ దేశాలకు చెందిన పలువురు నేతలకు భేటీ అయ్యారు. చర్చలు జరిపారు. కాగా, తమ సమావేశం ఎంతో ఆశావహంగా కొనసాగిందని, పరస్పర సహకారంపై ఒక అవగాహన కుదిరిందని మోదీ, షేక్ హసీనా ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదం నుంచి యావత్ ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. భద్రత, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి లాంఛనంగా ఒక అంగీకారానికి వచ్చారని పేర్కొన్నారు. ఇలావుంటే, గాంధీ 150 జయంతి ఉత్సవాలకు హాజరైన షేక్ హసీనాను మోదీ ప్రశంసించారు. బంగ్లాదేశ్ తమకు అత్యంత ఆత్మీయ దేశమని తెలిపారు. భద్రత, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ పరస్పర సహకారం అవసరమని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఉందని అన్నారు. కాగా, భారత్‌తో ఎంతోకాలంగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని షేక్ హసీనా అన్నారు. ‘బంగబంధు’ షేక్ ముజిబుర్ రహ్మాన్ జయంతి వేడులకు హాజరుకావాల్సిందిగా ఆమె మోదీని ఆహ్వానించారు. భూటాన్ ప్రధాని లొటే సెరింగ్‌ను కూడా ప్రధాని మోదీ కలిశారు. జల విద్యుత్ రంగంలో సహకరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపారం, వాణిజ్యం తదితర రంగాల్లోనూ అభివృద్ధికి భూటాన్‌తో కలిసి భారత్ పని చేస్తుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సత్వర సాయానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న తులసి గాబార్డ్‌ను కూడా మోదీ కలిశారు. అదే విధంగా వివిధ దేశాల ప్రముఖులతో విరామం లేకుండా సమావేశమవుతూ, పరస్పర సహకారంపై చర్చలు జరిపారు.
*చిత్రం...బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ