అంతర్జాతీయం

..చెప్పాల్సింది చెప్పా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 28: కాశ్మీర్‌లో జరుగుతున్న అక్రమాలు, అమానుషాల గురించి ప్రపంచ దేశాలకు తాను చెప్పాల్సింది చెప్పానని, తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిదేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితులను ప్రపంచ దేశాలు గుర్తించగలవన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
ఈ ఇంటర్వ్యూలో కూడా భారత్‌పైన, ప్రధానమంత్రి మోదీపైన ఇమ్రాన్ తీవ్ర స్వరంతోనే మాట్లాడారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన మోదీతో తాను సమావేశమయ్యే ప్రసక్తే లేదని అన్నారు. కాశ్మీర్‌పై ఇంతగా రాద్ధాంతం చేస్తున్నా ప్రపంచ దేశాలు పాక్ వాదనను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నకు ‘ప్రపంచ దేశాలు భారత్‌ను 100 కోట్ల జనాభా దాటిన ఓ పెద్ద మార్కెట్‌గానే పరిగణిస్తున్నాయి. భారత్‌తో వ్యాపార సంబంధాలపైనే దృష్టి పెట్టాయి. అందుకే కాశ్మీర్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి’ అని జవాబిచ్చారు. కాశ్మీర్ విషయంలో మూడో దేశ మధ్యవర్తిత్వానికి నరేంద్ర మోదీ ఒప్పుకోవడం లేదని, దీనిని ద్వైపాక్షిక సమస్యగానే చెబుతున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే, దీనిపై ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినపుడు ‘ఇది ఏకపక్ష అంశం’గా చెబుతున్నారని ఇమ్రాన్ అన్నారు. కాశ్మీర్‌పై ఆయన వైఖరిని బట్టి చూస్తే ఏవిధంగా ముందుకు వెళ్లాలో తనకు అర్థం కావడంలేదని అన్నారు. అయితే, ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రకటన ద్వారా తాను అనుకున్న లక్ష్యం సాధించానని, ఇక తదుపరి చర్యల బాధ్యత ప్రపంచ దేశాలదేనని ఆయన అన్నారు.