అంతర్జాతీయం

మీరా.. మాకు సుద్దులు చెప్పేది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 28: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగాన్ని భారత్ తీవ్ర పదజాలంతో తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని, విద్వేష సిద్ధాంతాన్ని పెంచి పోషించేవారి నుంచి కాశ్మీర్ ప్రజలకు ఎలాంటి సలహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఏకంగా ఓ ఉగ్రవాద పరిశ్రమనే పోషిస్తోందని, విద్వేషమే ఆయుధంగా వ్యవహరిస్తోందని భారత్ ధ్వజమెత్తింది. ఐరాసలో 50 నిమిషాలపాటు మాట్లాడిన ఇమ్రాన ఖాన్ దాదాపు 30 నిమిషాలపాటు ఇటు కాశ్మీర్‌ను, అటు భారత్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా భారత్‌తో అణుయుద్ధం తప్పదన్నట్టుగా హెచ్చరిక స్వరాన్ని ఆయన వినిపించారు. అనంతరం ఇమ్రాన్ ప్రసంగానికి సమాధానంగా భారత్ కూడా తన వాదనను అంతే బలంగా వినిపించింది. ఆయన చేసిన ప్రతి ఆరోపణను గట్టిగా తిప్పికొట్టింది. ఐరాసలోని భారత మిషన్ దౌత్యాధికారి విదిశ మైత్ర చాలా గట్టిగానే ఇమ్రాన్ ప్రతి మాటను ఖండించారు. వాస్తవాలను ప్రపంచ దేశాల కళ్లకు కట్టారు. విద్వేషాన్ని, విభేదాలను సృష్టించే రీతిలోనే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారని, దాదాపుగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చేందుకు ప్రయత్నించారని మైత్ర అన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఐరాసలో ఇమ్రాన్ చేసింది విద్వేషాన్ని రగిలించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు.
మొత్తం ఐరాసనే నిలువునా చీల్చేందుకు ఇమ్రాన్ తన ప్రసంగాన్ని వినియోగించుకున్నారని, ప్రతి మాటలో విద్వేషాన్ని, అసహనాన్ని వెళ్లగక్కారని మైత్ర తెలిపారు. ఐరాస వేదికను ఇంత ఘోరంగా ఓ దేశ నాయకుడు తన విద్వేషాన్ని రగిలించేందుకు దుర్వినియోగం చేసిన దాఖలాలు ఇంతవరకు ఎప్పుడూ లేవని అన్నారు. ముఖ్యంగా రక్తపాతం, జాత్యహంకారం, తుపాకులు పట్టండి, చివరివరకు పోరాడతాం వంటి మాటలను ఇమ్రాన్ చాలా పరుషంగా వాడారని, ఇవన్నీ కూడా మధ్యయుగం నాటి ఆలోచనా రీతిని స్పష్టం చేస్తున్నాయే తప్ప 21వ శతాబ్ద దృక్పథానికి అద్దం పట్టడం లేదని ఆమె అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉజ్వలంగా సాగుతున్న నేటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ప్రయోగించిన మాటలకు ఏకోశానా ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. 1971లో తన సొంత ప్రజలపైనే అప్పటి పాక్ పాలకులు సాగించిన నరమేధాన్ని ఎవరు మరచిపోగలరని ఆమె అన్నారు. అణుయుద్ధానికి కూడా వెనుకాడమంటూ ఇమ్రాన్ చేసిన హెచ్చరిక ఆయన దురహంకారానికి, ఆధిపత్య ధోరణికి అద్దం పట్టిందే తప్ప ఆయన విజ్ఞతను చాటిచెప్పలేదని ఆమె అన్నారు. పైగా దాదాపుగా ఉగ్రవాదాన్ని బలపరిచే రీతిలోనే ఇమ్రాన్ మాట్లాడడం అత్యంత హేయమని, అలాంటి వ్యక్తుల సలహాలను స్వీకరించే స్థితిలో భారత ప్రజలు లేరని మైత్ర స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, మానవహక్కుల పరిరక్షణ బాధ్యత తనదేనని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.

*చిత్రం...పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంలోని ప్రతి పదాన్నీ తిప్పికొడుతూ
ఐరాసలో మాట్లాడుతున్న భారత దౌత్యాధికారి విదిశ మైత్ర