అంతర్జాతీయం

అణు యుద్ధం జరిగితే.. పర్యవసానాలు తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 27: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్‌లో భారత్ అనుసరిస్తున్న విధానంపై శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాశ్మీర్‌లో అమానుషంగా అమలవుతున్న కర్ఫ్యూను ఎత్తివేయాలని, నిర్బంధించిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు ఐరాస వేదికపై మాట్లాడిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా శాంతి సందేశానే్న వినిపించగా, అందుకు విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ రెచ్చిపోయారు. మోదీ నిర్ణీత కాల వ్యవథిలోనే తన ప్రసంగాన్ని ముగిస్తే, ఇమ్రాన్ అరగంటకు పైగా మాట్లాడారు. అణ్వాయుధ శక్తి గల భారత్-పాక్‌ల మధ్య యుద్ధం జరిగితే దాని పర్యావసనాలు మొత్తం ప్రపంచానే్న తాకుతాయని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు తక్షణమే జోక్యం చేసుకుని ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిరోధించాలన్నారు. లేనిపక్షంలో రక్తపాతమే తలెత్తే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయన అరగంట ప్రసంగంలో అనేక సార్లు కాశ్మీర్ అంశమే చోటు చేసుకుంది. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దును ఇమ్రాన్ ఖాన్ నిరసించారు. భారత్-పాక్‌ల మధ్య యుద్ధమే సంభవిస్తే అది ఎలాంటి పరిణామాలకైనా దారి తీయవచ్చని పేర్కొన్న ఆయన ‘పొరుగు దేశం కంటే ఏడు రేట్లు చిన్నదైన ఓ దేశానికి లొంగిపోవడం లేదా ఉనికి కోసం చివరి వరకు పోరాడడం తప్ప మరో మార్గం ఉండదు’ అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏమి చేయగలుగుతుందని ప్రశ్నించారు. అసలు తమ దేశంలోనే ఉగ్రవాద సంస్థలు లేవని అన్నారు. కాశ్మీర్‌లో మానవీయ సంక్షోభమే తలెత్తుతుందని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. తను ఐక్యరాజ్య సమితికి రావడానికి కారణం కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఐరాస తీర్మానాలను ఉల్లంఘించిందని చెప్పడానికేనని ఇమ్రాన్ అన్నారు. కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును కాపాడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిదేనని అన్నారు. ఇస్లాం ఉగ్రవాదం ముసుగులో కాశ్మీర్ ప్రజలపై భారత్ క్రూరంగా వ్యవహారిస్తున్నదని అన్నారు. ప్రపంచమంతా ఇస్లాం ఫోబియా వ్యాపించిందని కోటానుకోట్ల మంది ముస్లింలు అనేక పశ్చిమ దేశాల్లో మైనారిటీలుగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. ముస్లింలు చివరకు బురఖా ధరించినా దానిని ఓ ఆయుధంగా పరిగణించే పరిస్థితి తలెత్తిందని అన్నారు.