అంతర్జాతీయం

అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 27: ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), జీ-20 వంటి వివిధ అంతర్జాతీయ సం స్థల్లో సంస్కరణలు అత్యవసరమని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ జైశంకర్ స్పష్టం చేశారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రులతో కలిసి ‘ఐబీఎస్‌ఏ’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి సంయుక్త ప్రకటన చేశారు. అంతర్జాతీయ సంస్థలను ప్రపంచానికి మరింత చేరువగా తీసుకెళ్లడానికి, మరింత సమర్థంగా పని చేయడానికి వీలుగా సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉందని బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరోజో, దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకారం మంత్రి నలెడీ పాండర్‌తో కలిసి విడుదల చేసిన ప్రకటనలో జైశంకర్ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సంస్థల్లో మార్పులను ఐబీఎస్‌ఏ గట్టిగా కోరుతున్నది. ఈ దిశగా మేము కలిసి ముందుకు వెళతాం. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. సమన్వయంతో పని చేసినప్పుడే, అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతర్జాతీయ సంస్థలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే, ముందుగా వాటిని సంస్కరించాలి. ఇందుకుగాను భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల సంయుక్త కృషి కొనసాగుతునే ఉంటుంది’ అన్నారు. ఐక్యరాజ్య సమితి, డబ్ల్యూటీఓతోపాటు జీ-20లోనూ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్న ‘బ్రిక్స్’, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనాతో కూడిన ‘బేసిక్’ కూటముల్లోనూ మార్పులు అత్యవసరమని పేర్కొన్నారు. జీ-77లోనూ మార్పులు అనివార్యమవుతాయని స్పష్టం చేశారు. ప్రపంచం ఎందుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించాలంటే, అన్ని దేశాలూ ఒకే తాటిపై నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కోసం అంతర్జాతీయ సంస్థలు మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి (యూఎన్), భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లోనూ సంస్కరణలు చేపడితేనే, అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతామని జైశంకర్ తెలిపారు. ఈ మార్పుల కోసం ఐబీఎస్‌ఏ నిరంతరం కృషి చేస్తునే ఉంటుందని అన్నారు.