అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉమ్మడి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 26: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కలిసి కట్టుగా పనిచేయాలని భారత్, న్యూజిలాండ్‌లు నిర్ణయించాయి. ఈ జాఢ్యాన్ని రూపుమాపేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, జస్సిందా ఆర్‌డర్న్ నిర్ణయించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులో మాట్లాడడానికి వచ్చిన మోదీ న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అలాగే రాజకీయ, ఆర్థిక, రక్షణ, ప్రజా సంబంధాలను కూడా మెరుగు పరచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు వీరిమధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఉమ్మడి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పుల్వామా, క్రైస్ట్ చర్చ్‌పై జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
న్యూజిలాండ్‌లో ఉంటున్న భారతీయ సంతతి ప్రజలు ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి ఎంతగానో తోడ్పడుతున్నారని, రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తున్నారని న్యూజిలాండ్ ప్రధాని అన్నారు. అలాగే భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి తాలు క్రీయాశీలకంగా ఉన్నామని ఆమె తెలిపారు.

*చిత్రం... న్యూజిలాండ్ ప్రధాని జెస్సిందా ఆర్‌డర్న్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంతనాలు