అంతర్జాతీయం

కాశ్మీర్‌పై తోడ్పడతానన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 26: అసలు కాశ్మీర్ సమస్యపై అమెరికా వైఖరి ఏమిటన్నది గత రెండు రోజుల పరిణామాల నేపథ్యంలో గందరగోళంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన తీరు ఇందుకు ఆస్కారాన్ని ఇచ్చింది. తాజాగా ఆయనే మీడియ సమావేశంలో ఇందుకు సంబంధించి మాట్లాడారు. కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ఇరుదేశాల ప్రధానులతో స్పష్టం చేసినట్లుగా ట్రంప్ వివరించారు. ‘చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోండి’ అని వారిద్దరికీ సూచించానని ట్రంప్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కాశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, దీన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని ఇప్పటికే అనేక సార్లు భారత్ తెగేసి చెప్పింది. ఈ అంశంపై మూడో దేశం జోక్యానికి ఎలాంటి అవకాశం లేదని కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇరుదేశాల నేతలతో తాను నిర్మాణాత్మక చర్చలే జరిపానని ముఖ్యంగా కాశ్మీర్ అంశం గురించే మాట్లాడానని ట్రంప్ అన్నారు. ‘ఈ సమస్య పరిష్కారానికి నేనెలాంటి సహాయం చేయాల్సి వున్నా చేస్తాను’ అని ఇద్దరికీ స్పష్టం చేశానన్నారు. ఇటీవలి కాలంలో కాశ్మీర్ సమస్య చాలా తీవ్రంగా మారిందన్న విషయాన్ని వెల్లడించిన ట్రంప్ దీన్ని పరిష్కరించుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని అన్నారు. ఈ వ్యవహారంపై మధ్యవర్తిత్వం జరుపుతానంటూ ట్రంప్ ముందు కు రావడం ఇటీవలి కాలంలో ఇది నాలుగోసారి. కాశ్మీర్‌పై ట్రంప్ తాజా వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ ‘ఈ విషయంలో మా వైఖరి చాలా స్పష్టం. ప్రధాని నరేంద్ర మోదీ అనేక సార్లు దీన్ని వెల్లడించారు. భారత విదేశాంగ కార్యదర్శి కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు’ అని తెలిపారు. ట్రంప్‌తో సమావేశమైన సందర్భంగా మాట్లాడిన మోదీ పాకిస్తాన్‌తో చర్చల విషయంలో తాము విముఖంగా లేమని వెల్లడించారన్నారు. అయితే ఈ చర్చలు జరగాలంటే ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.
*చిత్రం... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి