అంతర్జాతీయం

పాక్‌తో సంబంధాల పెంపునకు భారత్ చర్యలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 25: కాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. పాకిస్తాన్‌తో సత్సంబంధాల మెరుగునకు మోదీ చేసే యత్నాలను ప్రోత్సహిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేసినట్లు మంగళవారం వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సమావేశాల నేపథ్యంలో రెండోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కావడం ఇది నాలుగోసారి. రక్షణ, భద్రతా పరమైన సహకారం తదితర అంశాల్లో పాకిస్తాన్‌తో భారత్ వైఖరిలో పురోగతి కనిపిస్తోందని వైట్‌హౌస్ పేర్కొంది. ‘కాశ్మీర్ ప్రజల జీవనశైలిలో మార్పునకు మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయం.. అలాగే, పాకిస్తాన్‌తో సంబంధాల పెంపునకు చేస్తున్న ప్రయత్నాలు సైతం అభినందనీయం’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాశ్మీర్ అంశం ద్వైపాక్షికం అనీ.. ఇందులో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదన్న విషయానికి భారత్ కట్టుబడి పనిచేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాక్-్భరత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం.. ప్రత్యేక హోదా రద్దును పాక్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా పాక్‌లోని భారత్ రాయబారిని సైతం బహిష్కరించడం వంటి అంశాలు ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ అంశాన్ని పాక్ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లగా.. భారత్ దీనిని గట్టిగా ఖండించింది. కాశ్మీర్ అంశం పూర్తిగా భారత్ ‘అంతర్గత వ్యవహారం’గా తేల్చిచెప్పింది. ఉగ్రవాదంతో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఎదురౌతున్న పరిణామాలను ట్రంప్‌కు మోదీ సవివరంగా తెలియజేశారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు. గత 30 సంవత్సరాల్లో ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌కు చెందిన 42వేల మంది అసువులు బాసారని.. దీనిపై అంతర్జాతీయ సమాజం జోక్యం అవసరం అన్న సంగతిని భారత్ గుర్తు చేసినట్లు గోఖలే విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ఎలాంటి భేషజాలకు పోవడం లేదనీ.. అయితే, చర్చలకు ముందు పాక్ కొన్ని నిర్దిష్ట చర్యలు చేపట్టాలని కోరామనీ.. వాటిని ఇంతవరకు పాక్ అమలు చేయలేదని గోఖలే వివరించారు.