అంతర్జాతీయం

దూసుకుపోతున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 25: భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా ప్రవాసాంధ్రులతోపాటు అమెరికన్లకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏవైనా అడ్డంకులు ఎదురైతే తాను అండగా నిలబడతానని ఇక్కడ జరిగిన బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ బిజినెస్ మీట్‌లో మాట్లాడుతూ భరోసా ఇచ్చారు. ఆర్థిక అనిశ్చితి నుంచి బయట పడేందుకు కృతనిశ్చయంతో ముందుకు పోతున్నట్టు మోదీ చెప్పారు. బీజేపీ సర్కారు హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోందని, సరికొత్త పంథాల్లో దూసుకుపోతున్నదని ఆయన అన్నారు. పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులు మరింత సులభతరం అవుతున్నాయని ఆయన అన్నారు. ‘మీ కల.. మా కల.. రెండూ ఒకటే.. సరిగ్గా సరిపోయాయి’ అని ఈ సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో రెండోసారి తాము భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చామని ఆయన గుర్తు చేశారు. అంటే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాన్ని ప్రజలు తమకు కల్పించారని మోదీ అన్నారు. 130 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలబడడం ఆర్థిక సంస్కరణలకు మద్దతు పలకడంగానే అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సంపద సృష్టికి తమ ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తోందని ఆయన అన్నారు. కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గించడం ఓ విప్లవాత్మక సంఘటనగా ఆయన అభివర్ణించారు. దీని ద్వారా కార్పొరేట్ రంగంలో భారీ పెట్టుబడులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సుమారు 50 చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించిందని ఆయన అన్నారు. ఈ విప్లవాత్మక మార్పుల వల్లే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతం అయిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అవలంబిస్తోందని ఆయన అన్నారు. గతంలో ముక్కోణపు పన్ను విధానం ఉండేదని, దాని స్థానంలో జీఎస్టీని అమలు చేశామన్నారు. దీని ద్వారా దేశం మొత్తమీద ఒకే పన్ను విధానం అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ సంస్కరణలే అంతర్జాతీయ స్థాయిలో
భారత్‌కు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టాయని ఆయన పేర్కొన్నారు. భారత్ నిర్మాణానికి భాగస్వాములు కావాలంటే భారత్ రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి మూడు, నాలుగు నెలలు మాత్రమే అవుతోందని, సంస్కరణలకు ఇది ప్రారంభం మాత్రమేనని మోదీ అన్నారు. మరిన్ని సంస్కరణలు రానునాన్నయని అయన చెప్పారు. విస్తృతమైన భారత మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలంటే ఇదే మంచి తరుణమని ఆయన విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. భారత ఆర్థికాభివృద్ధి చరిత్రలో భాగస్వాములుగా మిగిలిపోవాలంటే ఇంతకుమించిన మంచి సమయం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కడైనా, ఏదైనా సమస్య ఉన్నట్టు అనిపిస్తే తానే స్వయంగా పూనుకుని సరిదిద్దుతానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచ పెట్టుబడిదారులకు, భారత్‌కు మధ్య తాను వారధి అవుతానని ఆయన తెలిపారు. ‘మీ కలలు..మా కలలు ఒకటే. మీ సాంకేతిక పరిజ్ఞానం..మా నైపుణ్యం..మొత్తం ప్రపంచానే్న మార్చివేస్తుంది. మనం కలిసి నడిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనదైన ముద్రను వేయగలుగుతాం. ఇది చెప్పడానికే నేను భారత్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చాను’ అని మోదీ అన్నారు. భారత జీవన విధానాన్ని ఆయన ప్రపంచంతో పోల్చారు. భూమిని మాతగా కొలుస్తామని మోదీ అన్నారు. భూమాతను జాగ్రత్తగా కాపాడుకోవాలే తప్ప, నిలుపుదోపిడీ చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. అవసరాలు ఏమిటో భారతీయులకు బాగా తెలుసునని ఆయన అన్నారు. అయితే, అత్యాశ పనికిరాదని అన్నారు. పనరుత్పాదక ఇంధన వనరుల విషయంలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ ఎంతో ముందంజలో ఉందని మోదీ అన్నారు. నీటి వృథా చేయకుండా నిల్వ ఉంచుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తున్నట్టు మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన ఆరోగ్య పథకాన్ని భారత్‌లో అమలు చేశామని మోదీ అన్నారు. కెనడా, మెక్సికో, అమెరికా దేశాల్లో ఉండే ప్రజల కంటే ఎక్కువ మందికి ఈ పథకం వర్తిస్తుందని మోదీ చెప్పారు.

*చిత్రం...న్యూయార్క్‌లో బుధవారం బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ బిజినెస్ మీట్‌లో మాట్లాడుతున్న నరేంద్ర మోదీ