అంతర్జాతీయం

వెల్లివిరిసిన ద్వైపాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 24: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ జరుగుతున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విడిగా జర్మనీ చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్, ఇటలీ ప్రధాన మంత్రి గియుసెప్పె కాంటే ఖతర్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ సహా అనేక మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక భేటీలు జరిపారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన మోదీ ఐరాస క్లైమేట్ యాక్షన్ సమ్మిట్, ఉన్నత స్థాయి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కార్యక్రమాలలో మాట్లాడారు. అయిదు రోజుల న్యూయార్క్ పర్యటనకు వచ్చిన మోదీ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విడిగా మెర్కెల్, గియుసెప్పె కాంటే, షేక్ తమీమ్ బిన్, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ మార్‌క్వెజ్, నైగర్ అధ్యక్షుడు ఇస్సౌఫౌ మహమదౌ, నమీబియా అధ్యక్షుడు హేగ్ గెయిన్‌గోబ్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, భూటాన్ ప్రధానమంత్రి లోటేయ్ త్సెరింగ్, నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి మార్క్ ర్యూట్ సహా అనేక మంది దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. ప్రధాని మోదీ పాల్గొన్న వివిధ కార్యక్రమాల గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ విలేఖరులకు వివరిస్తూ, రెండు సమావేశాలలో జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితి అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. ‘జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి గురించి మీకు తెలిసిందే. అనేక దేశాలతో వివిధ స్థాయిల్లో మేము మాట్లాడటం జరిగింది. అయితే, విడిగా జరిపిన సమావేశాలలో ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది’ అని కుమార్ పేర్కొన్నారు. భారత్ ఆగస్టు అయిదో తేదీన జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్ భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. భారత హైకమిషనర్‌ను బహిష్కరించింది. భారత్ మొదటి నుంచి కూడా కాశ్మీర్ తనలో అంతర్భాగమని స్పష్టంగా చెబుతూ వచ్చింది. ఐరాస కాని అమెరికా కాని మధ్యవర్తిత్వం వహించడం అక్కర్లేదంటూ ఈ అంశంపై మూడో పక్షం జోక్యాన్ని తిరస్కరిస్తూ వచ్చింది.
*చిత్రాలు.. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌తో ... ఇటలీ ప్రధాని గూసెఫే కాంటేతో... న్యూయార్క్‌లో ఖతర్ నేత తమీన్ బిన్ అమన్‌తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ