అంతర్జాతీయం

అమెరికా జాతీయవాదంపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 24: అమెరికా జాతీయవాదం, సార్వభౌమత్వంపై రాజీ లేదని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఐక్యరాజ్య సమితిని ఉద్ధేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల నేతలందరూ తమ తమ దేశాలకు ప్రాధాన్యతనివ్వాలని, సరిహద్దులను పరిరక్షించుకోవాలని, పరస్పర వాణిజ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే అంతర్జాతీయ కూటమిలను, వివిధ దేశాలతో కూడిన సంస్థలను ఆయన తిరస్కరించారు. భవిష్యత్తు అంతా దేశ భక్తులదేనని, బలమైన స్వతంత్ర దేశాలదేనని ట్రంప్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాదం వల్ల ఆయా దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతలను కోల్పోయాని అన్నారు. ఇక అలాంటి రోజులకు స్వస్తి పలకాలని పేర్కొన్న ఆయన ‘అమెరికా స్వప్రయోజనాల పరిరక్షణలో రాజీ లేదు’ అని పునరుద్ఘాటించారు. ఇరాన్ కారణంగా అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమెరికా మిత్ర దేశాలపై దురాక్రమణను కట్టిపెట్టాలని ఇరాన్‌ను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఏ దేశంతోనూ అమెరికా ఘర్షణ కోరుకోదని, శాంతి-సహకారానే్న ఆశిస్తుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ఆయన అమెరికా ప్రయోజనాల పరిరక్షణలో మాత్రం వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. శాశ్వత శతృవులను కోరుకోవాలని అమెరికాకు ఎప్పుడూ లేదని, భాగస్వాములను మాత్రమే తాము కోరుకుంటామని తెలిపారు. అలాగే తమ దేశం అనుసరిస్తున్న కఠిన వలసవాద విధానాలను ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. దీనిని అనుసరించడం తప్ప ఇతర దేశాలకు మరో మార్గం లేదని ఆయన తెగేసి చెప్పారు. సరిహద్దుల్లో అదుపు లేకపోవడం, నియంత్రణ లేకుండా సాగుతున్న వలసల వల్ల అన్ని దేశాల భద్రతకు ముప్పు వాటిల్లిందన్నారు. సామాజిక న్యాయ పరిరక్షణ పేరిట మానవ హక్కుల ఉల్లంఘనకు కొన్ని శక్తులు పాల్పడుతున్నాయన్నారు.