అంతర్జాతీయం

రావత్ వ్యాఖ్యలు నిరాధారం: పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 24: బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరం మళ్లీ పనిచేస్తోందని భారత్ సైనిక ప్రధానాధికారి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యను పాకిస్తాన్ తోసిపుచ్చింది. రావత్ ప్రకటన పూర్తిగా నిరాధారమైందని విమర్శించింది. సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన బిపిన్ రావత్ బాలాకోట్‌లో జైషే స్థావరంలో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయని, భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది కాపుకాశారని ఆరోపరించారు. ఫిబ్రవరిలో బాలాకోట్‌పై భారత్ లక్షిత దాడులు జరిపింది. పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు సైన్యం ప్రకటించింది. కాగా రావత్ వ్యాఖ్యలు సత్యదూరమని పాక్ విదేశాంగ ప్రతినిధి అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడిన భారత్ అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకే ‘చొరబాట్లబూచి’ తెరమీదకు తెచ్చిందని పాక్ మండిపడింది. కాగా జమ్మూకాశ్మీర్ విభజన తరువాత ఆగస్టు 5 నుంచి పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించేందుకు పాక్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమని భారత్ తేల్చిచెప్పింది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది ఆత్మాహుతి దాడి తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పుల్వామా ఘటనకు ప్రతికారంగానే భారత వైమానిక దళం బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.