అంతర్జాతీయం

కాశ్మీర్‌పై కలిసి పని చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 24: కాశ్మీర్ సమస్యను భారత్-పాక్ ప్రధాన మంత్రులు కలిసి కట్టుగా పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాశ్మీర్‌పై తాము జోక్యం చేసుకునేది లేదన్న విషయాన్ని పునరుద్ఘాటించిన ఆయన ‘ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లు కాశ్మీర్‌పై కలిసి పని చేయాలి, వారు అలా చేస్తే ఎంతో గొప్ప ప్రయత్నం అవుతుంది..’ అని ట్రంప్ అన్నారు. హౌడీ-మోదీ కార్యక్రమం సందర్భంగా హోస్టన్‌లో మోదీతో సమావేశమైన ట్రంప్ న్యూయార్క్‌లోనూ ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని, రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొదించుకుంటామని ట్రంప్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ అధ్యక్షుడితో సమావేశం కావడం ఇది రెండో సారి. భారత్-పాక్ ప్రధానులు ఒకరిని ఒకరు
అర్థం చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయగలరన్న నమ్మకం తనకు ఉందన్నారు. పరస్పర అవగాహనతో వీరిద్దరు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పాకిస్తాన్ నుంచి తలెత్తున్న ఉగ్రవాదం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ట్రంప్ ‘ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని చూసుకుంటారు..’ అని అన్నారు. భారత్‌కు ఓ గొప్ప ప్రధాన మంత్రి ఉన్నారని, ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలరని పేర్కొన్నారు. పరస్పర వాణిజ్యాన్ని పెంపొదించుకునేందుకు ఇరు దేశాలూ ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు ఓ మంచి స్నేహితుడని అన్నారు. హౌడీ-మోదీ ర్యాలీలో పాల్గొన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మోదీని ఉద్ధేశించి మాట్లాడిన ట్రంప్ హోస్టన్ సమావేశాన్ని ప్రస్తావించారు. ‘మోదీ అంటే ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఆయన భారత్‌కు చెందిన అమెరికన్ ఎల్విస్’ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హౌడీ-మోదీ కార్యక్రమానికి సంబంధించిన ఓ ఫొటోను ట్రంప్‌కు మోదీ అందించారు. దానికి ఆయన కృతజ్ఞతెలు తెలిపారు.
సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో మాట్లాడిన ట్రంప్ ఇరు దేశాలు కోరుకుంటే కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తోడ్పడతానన్న సంకేతాలు అందించారు. అయితే దీనిపై ఎలాంటి ఊహగానాలు వద్దని మంగళవారం నరేంద్ర మోదీతో ట్రంప్ జరిపే చర్చల వరకూ ఆగాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
*చిత్రం... న్యూయార్క్‌లో మంగళవారం నరేంద్ర మోదీతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్