అంతర్జాతీయం

కాశ్మీరీ పండిట్ల హృదయాలను గెలిచిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, సెప్టెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలోని కాశ్మీరీ పండిట్ల హృదయాలను గెలుచుకున్నారు. కాశ్మీరీ పండిట్లతో మమేకమయి, వారి అనుభవాలను, కష్టనష్టాలను ఓర్పుతో విని, సహానుభూతిని వ్యక్తం చేయడం ద్వారా వారి విశ్వాసాన్ని చూరగొన్నారు.
అమెరికాలోని కాశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం ఇక్కడ తనను కలిసిన సందర్భంగా మోదీ వారితో ‘మీరు ఎనలేని కష్టాలు పడ్డారు’ అని అన్నారు. హూస్టన్‌తో పాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన అనేక మంది కాశ్మీరీ పండిట్లు ఆదివారం ఇక్కడ జరిగిన ‘హౌడీ, మోదీ!’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొన్న ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఈ మెగా ఈవెంట్ సందర్భంగా మోదీ విడిగా ఇక్కడ కాశ్మీరీ పండిట్లతో సమావేశమయ్యారు. ‘్భరత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత, పెద్ద సంఖ్యలో కాశ్మీరీ పండిట్లు తాము పుట్టి పెరిగిన గడ్డను వదలి ఇతర ప్రాంతాలకు వలసపోయిన తరువాత భారత ప్రధానమంత్రి ఒకరు సొంత గడ్డపై శరణార్థుల్లాగా మారిన కాశ్మీరీ పండిట్ల పరిస్థితిపై ఆందోళన చెంది, వారు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు’ అని అమెరికాలోని లాభాపేక్ష లేని సామాజిక- సాంస్కృతిక సంస్థ కాశ్మీరీ ఓవర్సీస్ అసోసియేషన్ (కేఓఏ) ప్రెసిడెంట్ శకున్ మాలిక్ అన్నారు.
‘కాశ్మీరీ పండిట్ల వారసత్వ సంపదను, హక్కును పరిరక్షించడం, పెంపొందించడం, అర్హులయిన, అవసరం ఉన్న కాశ్మీరీ పండిట్లకు ఆర్థిక సహాయం చేయడాన్ని కేఓఏ కార్యక్రమంగా పెట్టుకుంది’ అని ఆమె వివరించారు.

*చిత్రం...ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ