అంతర్జాతీయం

పార్లమెంటు సస్పెన్షన్ చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 24: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన బ్రెగ్జిట్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు తీవ్ర విఘాతం ఎదురైంది. పార్లమెంటును ఐదు వారాలపాటు సస్పెండ్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బ్రిటన్ సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. పార్లమెంటును సస్పెండ్ చేస్తూ బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్రెగ్జిట్ విషయంలో పార్లమెంటు పరిశీలన నుంచి తప్పుకోవడానికి బోరిస్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీలతోపాటు అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కూడా విమర్శలు గుప్పించారు. జాన్సన్ నిర్ణయాన్ని యూకే హైకోర్టులో బ్రెగ్జిట్ వ్యతిరేక ప్రచారకర్త, భారత సంతతికి చెందిన హీనా మిల్లర్ సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు సుప్రీంకోర్టు పరిశీలనకు నివేదించింది. పార్లమెంటును సస్పెండ్ చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వౌలిక భావనలను దెబ్బతీసేదిగా ఉందని సుప్రీంకోర్టు అధ్యక్షురాలు లేడీ బృంద అన్నారు. పార్లమెంటును ప్రోరోగ్ చేయాలంటే జాన్సన్ తీసుకున్న నిర్ణయం దాని రాజ్యాంగ విధులకు కూడా భంగం కలిగించిందని ఆమె పేర్కొన్నారు. దీని దృష్ట్యా సుప్రీంకోర్టులోని 11 మంది న్యాయమూర్తులు ప్రధాని నిర్ణయాన్ని చెల్లనిదిగా కొట్టివేసినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం బ్రెగ్జిట్ విషయంలో జాన్సన్‌ను మరింతగా ఇరుకున పడేసింది. ప్రస్తుతం ఐరాసా జనరల్ అసెంబ్లీ సమావేశం కోసం అమెరికాలో ఉన్న ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఏ వైఖరి అవలంబిస్తారన్నది రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. రాజకీయ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే అనేక సందర్భాల్లో జాన్సన్ స్పష్టం చేశారు. కాగా, ఈ తీర్పును పరిశీలిస్తున్నామని అధికార పార్టీ తెలిపింది.