అంతర్జాతీయం

మోదీ హోరు.. హోస్టన్ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, సెప్టెంబర్ 22:భారత ప్రధాని నరేంద్ర మోదీకి హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో అత్యంత ఉత్తేజకర రీతిలో దాదాపు 50 వేల మంది ప్రేక్షకులు ముక్తకంఠంతో స్వాగతం పలికారు. మోదీ వేదికపైకి అడుగు పెట్టినప్పటి నుంచి హౌడీ-మోదీ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మోదీకి ఆహ్వానం పలుకుతూ ప్రేక్షకుల హర్షధ్వనాలతో వేదిక ప్రాంగణం ప్రతిధ్వనించింది. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ మోదీ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వేదికపై భారతీయత ఉట్టిపడే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మొదట ట్రంప్‌ను భారతీయ కమ్యూనిటీకి పరిచయం చేసిన మోదీ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికాలో సాగుతున్న అభివృద్ధిని ప్రశంసించారు. అలాగే ఆయన నాయకత్వ పటిమను, అమెరికాను తొలి స్థానంలో నిలబెట్టాలన్న తపనను మోదీ కొనియాడారు. అనంతరం మాట్లాడిన ట్రంప్ ప్రసంగాన్ని ప్రేక్షకుల్లోనే కూర్చుని మోదీ ఆలకించారు.

*చిత్రం... హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో సభికులు