అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్: పాకిస్తాన్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 26 మంది మృత్యువాతపడగా, 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతి వేగం పైగా రోడ్డుపై మలుపు ఉండడంతో డ్రైవర్ స్టీరింగ్ కంట్రోలు చేయలేక పోవడంతో బస్సు పర్వతం వైపు దూసుకెళ్ళిందని పోలీసులు తెలిపారు. స్క్రద్దు నుంచి రావాల్పిండి వైపు బస్సు వెళుతుండగా మార్గమధ్యంలో గిల్గిట్-బలిస్తాన్ (జీబి)లోని పకుత్వుంక ప్రాంతంలోని బాబుసర్ పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 16 మంది పాకిస్తాన్ సైనికులు ఉన్నారని గిల్గిట్-బలిస్తాన్ ముఖ్యమంత్రికి అధికార ప్రతినిధిగా ఉన్న రషీద్ అర్షద్ తెలిపారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంలో బస్సు ఇనుప చువ్వల కింద చిక్కుకుని మరణించారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చేర్పించామని, వీరిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. బస్సు ఓ ప్రైవేటు కంపెనీకి చెందినదని ఆయన చెప్పారు. మలుపు వద్ద బస్సు అదుపు తప్పిందని ఆయన తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరం చేశామని, ఇందుకు హెలికాప్టర్‌ను కూడా ఉపయోగిస్తున్నామని ఆయన వివరించారు. ప్రతి ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ రోడ్డు మార్గంలో అనుమతి ఇస్తున్నారు. మిగతా సమయంలో మంచు అధికంగా కురుస్తుంది కాబట్టి ప్రయాణికులను అనుమతించారు. అయితే ఈ మార్గంలో తప్పనిసరిగా ప్రమాదాలు జరుగుతున్నాయి.