అంతర్జాతీయం

ఉగ్రవాదం మూలం పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెల్సింకి, సెప్టెంబర్ 21: పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టేందుకు భారత్ దౌత్యపరంగా చురుకుగా కదులుతోంది. ఈ చర్యలలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఫిన్లాండ్ ఉన్నత స్థాయి నాయకత్వంతో సీమాంతర ఉగ్రవాదంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత్ జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్‌కు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న ఫిన్లాండ్ కాశ్మీర్ అంశంపై ఇప్పటికే భారత్‌కు మద్దతు ఇచ్చింది. మూడు రోజుల అధికారిక పర్యటన కోసం ఫిన్లాండ్‌కు చేరుకున్న జైశంకర్ శుక్రవారం ఫిన్లాండ్ ప్రధాన మంత్రి అన్‌ట్టి రినె్న, విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టోతో విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. జైశంకర్, హావిస్టో ఉగ్రవాదంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ ఇద్దరు నేతలు గ్రీన్ టెక్నాలజీస్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారని విదేశీ వ్యవహారాల మంత్రి సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో శుక్రవారం పోస్ట్ చేసిన ఒక సందేశంలో తెలిపారు. తరువాత ‘్ఫన్నిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫేర్స్ (ఎఫ్‌ఐఐఏ)లో శుక్రవారం జైశంకర్ ‘్భరత్, ప్రపంచం- భారత విదేశాంగ విధానం ప్రాధాన్యతలు’ అనే అంశంపై మాట్లాడుతూ భారత్ తన జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుందని అన్నారు.