అంతర్జాతీయం

తొలుత పాక్.. తర్వాత భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అవుతారు. తర్వాతి రోజున ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. సోమవారం ఇమ్రాన్, మంగళవారం మోదీతో ట్రంప్ సమావేశమై, వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన తర్వాత, భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో భారత్‌తో యుద్ధం తప్పదని, అదే తమ ఆత్మవిశ్వాసం కోసం జరిగే చివరి పోరాటం అవుతుందని పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ హెచ్చరించిన విషయం తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ అణు యుద్ధానికి అవకాశాలు లేకపోలేదని భారత్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాశ్మీర్ అంశం తమ ఆంతరంగికమని, ఇందులో ఇతరుల జోక్యం అవసరం లేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ఇలావుంటే, 370 ఆర్టికల్ రద్దు తర్వాత భారత్, పాక్ ప్రధానులు తొలిసారి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశానికి హాజరుకానున్నారు. అంతకంటే ముందు, ఇరువురు ప్రధానులతో ట్రంప్ భేటీ అవుతారు. హూస్టన్‌లో జరిగే ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి హాజరైన తర్వాత, ఆయన ఆదివారం రాత్రికి న్యూయార్క్ చేరుకుంటారు. సుమారు 50,000 మంది ప్రవాస అమెరికన్లు హాజరయ్యే ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రత్యేకను సంతరించుకుంది. ఇలావుంటే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా పూనుకుందని, అందులో భాగంగానే ఇమ్రాన్, మోదీలతో సమావేశం అవుతారని అంటున్నారు. అధ్యక్ష కార్యాలయం అధికారి ఒకరు సోమవారం ఇమ్రాన్, మంగళవారం మోదీతో ట్రంప్ భేటీలను ధ్రువీకరించారు. ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ట్రంప్ ఒహియోకు వెళతారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌ను కలుస్తారని ఆ అధికారి ప్రకటించారు. కాగా, ఇమ్రాన్ ఆతర్వాత మోదీతో జరిగే చర్చల్లో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు రావడం ఖాయంగా కనిపిస్తున్నది. యూఎన్ సాధారణ సభ సమావేశంలో కాశ్మీర్‌పై రగడ తప్పదని అనుకుంటున్న నేపథ్యంలో, ఇరు దేశాల ప్రధానులతో ట్రంప్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
*చిత్రాలు.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ