అంతర్జాతీయం

పర్యావరణ పరిరక్షణలో భారత్ కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 21: పర్యావరణ పరిరక్షణతోపాటు పునరుద్పాదక ఇంధన వనరుల పెంపుదలలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నదని ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రధాన కార్యదర్శి ఆంటానియో గటెర్స్ ప్రశంసించారు. పలు సందర్భాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఆయన తమ పరిచయాన్ని గురించి పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సౌరశక్తిని వినియోగించేందుకు భారత్ పలు మార్గాల్లో అనే్వషణ కొనసాగిస్తున్నదని అన్నారు. ఇప్పటికే సౌరశక్తితో విద్యుత్ ఉత్పానను భారీ ఎత్తున చేపట్టిందని గటెర్స్ అన్నారు. యూఎన్‌కు భారత్ 193 సోలార్ ప్యానెల్స్‌ను బహుమతిగా ఇచ్చిందని, అవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘సౌర విద్యుత్‌పై భారత్‌లో భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. భారత్‌తో మాకు సౌరశక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ఒప్పందాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. అంతేగాక, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత కోసం మోదీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. భారత్‌లో ఈ ఉద్యమమం కొనసాగుతుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది’ అన్నారు. ఆదివారం ఎంపిక చేసిన కొంత మంది పాత్రికేయులతో కలిసి గటెర్స్ విందు చేస్తారు. ఆతర్వాత వారితో ముచ్చటిస్తారు. అనంతరం ‘క్లైమెట్ యాక్షన్’ సదస్సుకు హాజరవుతారు. ఆ సదస్సులో తొలుత భారత ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్, మార్షల్ ఐలాండ్స్ అధ్యక్షురాలు హిల్డా హైనే, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మార్కెల్ కూడా ప్రసంగిస్తారు. క్లైమెట్ యాక్షన్ సదస్సును గురించి గటెర్స్ ప్రస్తావిస్తూ, ఇందులో మోదీ కీలకోపన్యాసం చేస్తారని, స్వచ్ఛమైన పర్యావరణానికి జరుగుతున్న కృషిలో భారత్ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నదో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. ఈ చర్చలో భారత్‌ను ప్రాథమిక భాగస్వామిగా ఆయన అభివర్ణించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, సమతౌల్యాన్ని కొనసాగించడానికి యూఎన్ అన్ని విధాలా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. భారత్ నుంచి లభిస్తున్న సహాయ సహకారాలు అద్భుతమని కొనియాడారారు. 193 దేశాల కీలక నేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని, ఈనెల 24న యూఎన్ ప్రధాన కార్యాలయంలో ‘గాంధీ సోలార్ పార్క్’ను మోదీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి గటర్స్‌తోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జీ ఇన్, సింగపూర్ ప్రధాని లీ జిన్ లూంగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ తదితరులు పాల్గొంటారు.
*చిత్రం...యూఎన్ ప్రధాన కార్యదర్శి గటెర్స్