అంతర్జాతీయం

‘సౌదీ డ్రోన్ దాడుల్లో మా ప్రమేయం లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెహ్రాన్, సెప్టెంబర్ 18: సౌదీ అరేబియా చమురు శుద్ధి క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో తమ దేశ ప్రమేయమేదీ లేదని ఇరాన్ పేర్కొంది. ఈమేరకు అమెరికాకు ఇరాన్ బుధవారం ఓ దౌత్యపర లేఖ రాసింది. అలాగే తమదేశం మీద జరిగే ఏ రకమైన దాడులనైనా తిప్పికొడతామని హెచ్చరించింది. ఆ తాఖీదు (లేఖ)ను ఇరాన్ సోమవారం స్వి స్ దౌత్య కార్యాలయం ద్వారా అమెరికాకు అందజేసింది. టెహ్రాన్‌లోని స్విడ్జర్లాండ్ దౌత్యకార్యాలయం అమెరికా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంటుంది.
అమెరికా-ఇరాన్ మధ్య 1980 నుంచి దౌ త్య సంబంధాలు లేని విషయం తెలిసిందే. కాగా ‘ఈ దాడులతో ఇరాన్ ఎలాంటి పాత్రా పోషించలే దు’ అని ఆ తాఖీదులో ఇరాన్ స్పష్టం చేసిందని ఐఆర్‌ఎన్‌ఏ వార్తా సంస్థకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే తమ దేశంపై వచ్చిన ఆరోపణలను, సౌదీలో జరిగిన డ్రోన్ దాడులను ఖండించింది.
ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డో నాల్డ్ ట్రంప్, ఆ ప్రభుత్వ కార్యదర్శి మైక్ పాంపియో సౌదీ డ్రోన్ దాడుల వెనుక తమ దేశం హస్తం ఉం దని ఆరోపించడాన్ని ఇరాన్ తీ వ్రంగా ఖండించిం ది. ‘ఒక వేళ మా దేశానికి వ్యతిరేకంగా ఏవైనా చ ర్యలు తీసుకుంటే తక్షణమే తమదేశ ప్రతిఘటనను ఎదుర్కోక తప్పద’ని, ‘తమ చర్య కేవలం హెచ్చరికకే పరిమితం కాద’ని ఆ తాఖీదులో పేర్కొంది.
ఇరాన్‌పై ఆంక్షలు పెంచండి..
ఇరాన్‌పై ఆంక్షలు మరింతగా పెంచాలని ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. సౌదీ అరేబియా చమురు నిక్షేపాలపై జరిగిన దాడుల్లో ఇరాన్ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌదీపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇరాన్ అనుసరిస్తున్న వైఖరి యుద్ధానికి దారితీసేవిధంగా ఉంటుందని ఆరోపిస్తూ అమెరికా ఇదివరకే పలు ఆంక్షలు విధించింది. ఆ తర్వాత నేరుగా యుద్ధానికి తలపడే అవకాశాలు ఉన్నాయనే రీతిలో సైన్యాన్ని కూడా మోహరింపజేసింది. ఒకవేళ అమెరికా యుద్ధానికి దిగితే తాము ఎదురు దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో పరిస్థితి మరింత జఠిలం గా మారింది. ఏ క్షణమైనా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలుకావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ అరేబియా చ మురు నిక్షేపాలపై దాడులు జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికీ ఇరాన్ చర్యేనని నమ్ముతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలను మరింత తీవ్రతను చేయడంతోపాటు కొత్తగా మరికొన్నింటిని కూడా చేర్చాలని ఆదేశాలు జారీ చేశా రు. ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

*గత శనివారం జరిగిన ద్రోన్ దాడిలో తగలబడుతున్న అరమ్‌కో రిఫైనరీ (ఫైల్)