అంతర్జాతీయం

ఉగ్రవాదులకు ఆశ్రయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, సెప్టెంబర్ 18: ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్నదని ప్రపంచవ్యాప్తంగా విధ్వంసకాండకు కారణమవుతోందని యూరోపియన్ యూనియన్‌లో పార్లమెంటు సభ్యులు రైజార్డ్ జెనిస్కీ, ఫల్వియో మార్కిసిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడులు ఏ చంద్రమండలం నుంచో జరిగినవి కాదని వారు వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన ప్లీనరీ సమావేశంలో కాశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పోలాండ్‌కు చెందిన జెనిస్కీ మాట్లాడుతూ భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు. అక్కడ జరుగుతున్న ఉగ్రవాద దాడులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేకించి జమ్మూకాశ్మీర్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని చెప్పారు. వీరంతా పొరుగు దేశం నుంచే వస్తున్నారని అన్నారు. ఇటలీకి చెందిన మరో పార్లమెంటు సభ్యుడు మార్కిసిలో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం పేట్రేగకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని అన్నారు. ఉగ్రవాదానికి, దాడులకు పాకిస్తాన్ ఏదో ఒకరకంగా కారణం అవుతోందని ఆరోపించారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో జరిగిన దాడులకు కూడా పాక్ నేపథ్యం ఉన్న సంస్థలు, వ్యక్తులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ప్లీనరీలో పాల్గొన్న పలువురు ఇతర పార్లమెంటేరియన్లు కూడా పాక్ వైఖరిని ఎండగట్టారు. భారత్‌లో అనేక సందర్భాల్లో జరిగిన దాడులన్నింటికీ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు కారణమని వారు స్పష్టం చేశారు. గత నెల 5న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాశ్మీర్ అంశాన్ని వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని చైనా ద్వారా లేవనెత్తిన పాక్ అభాసుపాలైంది. కాగా, యూరోపియన్ యూనియన్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా భారత్‌కు మద్దతు పలకడం పాకిస్తాన్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో భారత్‌తో యుద్ధం తప్పకపోవచ్చునని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రైల్వే మంత్రి షేక్ రషీద్ ఖాన్ హెచ్చరించడంపై కూడా ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసే తీర్మానాలు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.