అంతర్జాతీయం

ఉగ్రవాదం పేట్రేగడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజాఫరాబాద్ (పీఓకే), సెప్టెంబర్ 13: కాశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అఘాయిత్యాలపై అక్కడి ప్రజలు తిరగబడతారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌ను హెచ్చరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజాఫరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు. కాశ్మీర్ ప్రజలకు చావంటే భయం పోయిందని, అణచివేత పరిస్థితుల్లో బతికే కంటే మరణించడమే మంచిదన్న భావన వారిలో ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూను తొలగించిన వెంటనే ఒక్కసారిగా ప్రజలు రెచ్చిపోతారని కూడా ఆయన హెచ్చరించారు. కాశ్మీర్‌లో ఏం జరుగుతోందో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ‘ఎప్పుడైతే ప్రజలు అణచివేతకు గురవుతారో వారిలో తీవ్రవాదం రగులుకుంటుంది’ అని అన్నారు. బాలాకోట్ తరహా సంఘటనలకు పాల్పడితే భవిష్యత్తులో పాకిస్తాన్ కూడా దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇంతకుముందు జరిగిన మరో ర్యాలీలో కూడా కాశ్మీర్‌లో పుల్వామా తరహా సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.