అంతర్జాతీయం

శవమూ కదులుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైర్న్స్ (ఆస్ట్రేలియా), సెప్టెంబర్ 13: మరణించిన వ్యక్తి శరీరం అచేతనం అన్నది ఇప్పటివరకూ మనం నమ్ముతూ వస్తున్నది. కానీ, మరణించిన ఏడాది వరకు మానవ శరీరాలు గణనీయంగా కదులుతాయని ఆస్ట్రేలియాకు చెందిన ఒక శాస్తవ్రేత్త రుజువుచేశారు. తన పరిశోధనలో భాగంగా 17 నెలలపాటు ఒక శవాన్ని అలిసన్ విల్సన్ అనే మహిళా శాస్తవ్రేత్త పరిశీలించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఒక వార్తా సంస్థకు ఆమె వెల్లడించారు. శవానికి కట్టేసిన చేతులు ఒకవైపు ఒరిగిన విషయాన్ని కూడా తాను గమనించానని ఆమె తెలిపారు. శరీర భాగాలు మరణానంతరం కూడా కదలడానికి గల కారణం.. శరీరంలో అంతర్గతంగా జరిగే మా ర్పులని ఆమె వెల్లడించారు. ఈ పరిశోధన వల్ల ఎప్పుడు ఆ వ్యక్తి మరణం సంభవించిదన్న విషయాన్ని నిర్ధారించడానికి పోలీసులకు మరింతగా ఆస్కారం లభిస్తుందని, ఆ విధంగా నేర నిర్ధారణకు సాక్ష్యం అవుతుందని ఆమె చెబుతున్నారు.