అంతర్జాతీయం

కాశ్మీర్‌పై మా మాట వినేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 13: కాశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల మద్దతును చూరగొనడంలో పాకిస్తాన్ విఫలమైందని దేశీయ వ్యవహారాల మంత్రి ఇజాజ్ అహమ్మద్ షా అంగీకరించారు. కాశ్మీర్‌పై ప్రపంచ దేశాలకు ఎంతగా వాస్తవాలు వెల్లడించినా ఆ దేశాలు భారత్ మాటే నమ్ముతున్నాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలోని ఓ సీనియర్ మంత్రే కాశ్మీర్‌పై ఈ వ్యాఖ్యలు చేయడం, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇరకాటంలో పడ్డ పరిస్థితేనని నిపుణులు అంటున్నారు. ‘కాశ్మీర్‌లో తీవ్ర స్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రజలకు మందులు లేవు. హక్కులను అణచివేస్తున్నారు. పరిస్థితి ఇంత దారణంగా ఉన్నా ప్రపంచ దేశాలు మమ్మల్ని నమ్మడం లేదు. భారత్ మాటనే వేదవాక్కుగా పరిగణిస్తున్నాయి’ అని షా ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌పై తమ వాదనకు ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల నుంచి మద్దతు లభిస్తోందంటూ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ వ్యవహారాల మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాన్ని తప్పుపట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్ని అంతర్జాతీయ వేదికల్లోనూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే, 370 అధికరణ రద్దు తమ ఆంతరంగిక వ్యవహారమని, ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ గుర్తించాలని భారత్ స్పష్టం చేస్తూ వచ్చింది. కాగా, పాకిస్తాన్‌లోని జమాత్ ఉద్ దవా సహా నిషిద్ధ గ్రూపులకు చెందిన మిలిటెంట్లను జన జీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిందని ఇజాజ్ షా తెలిపారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడే కాకుండా మంచి పలుకుబడి కలిగిన మంత్రిగా భావిస్తున్న ఇజాజ్ షా ఈ ఇంటర్వ్యూలో అనేక ఇతర అంశాలనూ ప్రస్తావించారు. నిషిద్ధ సంస్థల సభ్యులను దారిలోకి తెచ్చేందుకు చర్యలు మొదలయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సరుూద్ ఇందుకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్నారని, జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దేశంలోని జిహాదీ గ్రూపులను అణచివేస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఈనెలాఖరులో న్యూయార్క్ వెళ్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రెండుసార్లు సమావేశమయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. విందు సమయంలోనూ అలాగే ఐటీ వేదికలోనూ వీరిద్దరూ మాట్లాడుకునే అవకాశం ఉంటుందని జియో న్యూస్ వెల్లడించింది.