అంతర్జాతీయం

మరోసారి కలుసుకోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 12: తమ దేశంలో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నౌకాధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలుసుకునేందుకు భారత అధికారులను రెండోసారి అనుమతించేది లేదని పాకిస్తాన్ గురువారం స్పష్టం చేసింది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భారత్ మరణశిక్షపై స్టే ఇవ్వాలని కోరింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు జాదవ్‌ను కలుసుకునేందుకు భారత్ దౌత్య అధికారులను పాకిస్తాన్ అనుమతించింది. ఇందులో భాగంగా ఈనెల రెండో తేదిన ఇస్లామాబాద్‌లో ని భారత హై కమిషన్ అధికారి గౌరవ్ అహ్లూ వాలియా రెండు గంటల పాటు జాదవ్‌తో సమావేశమయ్యారు. అయితే మరోసారి జాదవ్‌ను కలుసుకునేందుకు భారత్ అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేంది లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు. జాదవ్ విషయంలో భారత్- పాక్ ల మధ్య తీవ్రస్థాయిలోనే దీర్ఘకాలంగా వాగ్వియుద్ధం జరుగుతోంది. ఇరాన్ నుంచి తమ దేశంలోకి ప్రవేశించిన జాదవ్‌ను బలూచిస్తాన్‌లో తమ అధికారులు అరెస్ట్ చేశారని పాకిస్తాన్ చెబుతోంది. జాదవ్‌ను ఇరాన్ నుంచి పాకిస్తాన్ అధికారులు కిడ్నాప్ చేశారని భారత్ ఆరోపిస్తోంది.