అంతర్జాతీయం

కర్తాపూర్‌కు కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 25: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నా, భారత దేశ సిక్కు యాత్రికుల కోసం కర్తాపూర్ కారిడార్‌ను పూర్తి చేసే విషయంలో కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని సహాయకురాలు ఫిర్దౌస్ అశిఖ్ అవాన్ తెలిపారు. బాబా గురు నానక్ 550వ జయంతి ఉత్సవాలు కర్తాపూర్‌లో జరగనున్నాయని పాక్ ప్రధాని ఫిర్దౌస్ ఆదివారం తెలిపారు. కర్తాపూర్ కారిడార్ వల్ల పాక్‌లోని దర్బార్‌కు, గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ విగ్రహం వరకు మార్గాలు కలుస్తాయి. భారత దేశ సరిహద్దు నుంచి కర్తాపూర్ కారిడార్ వరకు పాక్ ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇక్కడికి భారత్ సిక్కు యాత్రికులు చేరుకోవడానికి వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం అనుమతి తీసుకుంటే సరిపోతుంది. 1522 సంవత్సరంలో ఈ విగ్రహాన్ని గురు నానక్ ప్రారంభించారని పాక్ ప్రధాని ఫిర్దౌస్ అశిఖ్ అవాన్ ప్రత్యేక సహాయకురాలు ఆదివారం ట్వీట్ చేశారు. సిక్కు మతస్తులకు కర్తాపూర్ పవిత్ర స్థలం అని తెలిపారు. మత సామరస్యానికి ఇది ప్రతీకగా నిలిచిందని సహాయకురాలు పేర్కొన్నారు. కర్తాపూర్‌లోని దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవడానికి వెళ్ళాలనుకుంటున్న భారతీయ సిక్కు మతస్థులను పాక్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్న భారత ప్రభుత్వ వాదనను, ఆరోపణను ఆమె ఖండించారు. పాక్-్భరత్‌ల మధ్య ఉద్రిక్తత ఉన్నా కర్తాపూర్‌లోని దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవడానికి సిక్కు యాత్రికులకు పాక్ ప్రభుత్వం ద్వారాలు తెరిచే ఉంచుతుందని ఆమె తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం, అసహనం పెరుగుతున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కర్తాపూర్ కారిడార్‌లో సహానాన్ని ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు. కారిడార్‌ను నిర్ణీత గడువు ప్రకారం నవంబర్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించి, జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన సంగతి తెలిసిందే.