అంతర్జాతీయం

ఫ్రాన్స్‌కు చేరుకున్న ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియారిజ్, ఆగస్టు 25: బహ్రెయిన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఫ్రాన్స్ చేరుకున్నారు. ఇక్కడ జరిగే జీ-7 పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడతారు. పర్యావరణం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఆయన కీలక ప్రసంగం చేస్తారు. అలాగే అనేకమంది ప్రపంచ నేతలతోనూ మోదీ విస్తృత భేటీ జరుపుతారు. జీ-7 దేశాల కూటమిలో భారత్‌కు సభ్యత్వం లేకపోయినప్పటికి కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యూల్ మాక్రాన్ వ్యక్తిగతంగా మోదీని ఈ సమావేశానికి ఆహ్వానించారు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యానికి ఈ ఆహ్వానమే తార్కారణమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే అంతర్జాతీయంగా భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్న వాస్తవాన్ని కూడా ఈ ఆహ్వానం ద్వారా ఫ్రాన్స్ గుర్తించినట్టు అయిందని తెలిపింది. జీ-7లో యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై కాశ్మీర్ అంశంపై మోదీ చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే వాణిజ్య అంశాలు, ఇతర ద్వైపాక్షిక విషయాలు కూడా వీరి మధ్య చర్చకు రావచ్చునని చెబుతున్నారు. జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోదీతో కాశ్మీర్ అంశంపై చర్చిస్తానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో పాక్‌తో సంబంధాలు క్షీణించాయి. అయితే, కాశ్మీర్ హోదా రద్దు అన్నది పూర్తిగా భారత్‌కు సంబంధించిన ఆంతరంగిక విషయమని, ఈ విషయంలో వాస్తవాలను అంగీకరించాలని పాక్‌కు భారత్ తెగేసి చెప్పింది. దీనిపై చైనా వెన్నుదన్నుతో భద్రతామండలికి వెళ్లినప్పటికీ పాకిస్తాన్‌ను ఎలాంటి ఊరట కలగలేదు.