అంతర్జాతీయం

ఉద్రిక్తతల సడలింపునకు ద్విముఖ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 24: జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన తాజా ఉద్రిక్తతలను తొలగించడానికి అమెరికా ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగంలోని సీనియర్ అధికారులు ఇక్కడ తెలిపారు. సరిహద్దుల మీదుగా భారత్‌లోకి ఎలాంటి చొరబాట్లను అనుమతించకుండా పాకిస్తాన్ సంయమనం పాటించడం, భారత్‌లో ప్రత్యేకించి కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వస్తుపరంగా, ఆర్థిక పరంగా మద్దతు ఇవ్వకుండా పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచడం అనేది ఒక వ్యూహమని వారు వెల్లడించారు. ‘నియంత్రణ రేఖ వెంట మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడకుండా నివారించాలని, గతంలో భారత్‌లో దాడులు చేసిన తన గడ్డ మీద ఉన్న ఉగ్రవాద గ్రూపులను అణచివేయాలని పాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తూ వస్తున్నారు’ అని ఒక సీనియర్ అమెరికా ప్రభుత్వ అధికారి తెలిపారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మొదటి వ్యూహాన్ని ప్రతిబింబించే విధంగా పాకిస్తాన్ తన గడ్డను సీమాంతర ఉగ్రవాదానికి ఉపయోగించుకోకుండా చేయటం ద్వారా అది తన నిబద్ధతను ప్రదర్శించేలా చూడటం అనేది ముఖ్యమని మరో అధికారి వెల్లడించారు. 1989లో పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ఉగ్రవాదులు, రాజ్యేతర శక్తులు పెద్ద సంఖ్యలో చొరబడటాన్ని ప్రస్తావిస్తూ, అలాంటి ఉదంతాలు పునరావృతం కాకూడదని అమెరికా పాకిస్తాన్‌ను హెచ్చరించిందని ఆ అధికారి తెలిపారు. పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితిని పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, రాజ్యేతర శక్తులు భారత్‌లోకి చొరబడటానికి ఉపయోగించుకోకూడదని అమెరికా కోరుకుంటోందని ఆ అధికారి పేర్కొన్నారు.