అంతర్జాతీయం

మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబు దాబి, ఆగస్టు 24: యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ అత్యున్నతమైన పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ లభించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించడంలో చేసిన కృషికి గుర్తింపుగా మోదీకి ఈ పౌర పురస్కారాన్ని అందజేసింది. 2015 సంవత్సరంలో అరబ్ దేశాల్లో పర్యటించిన మోదీ ఇరు దేశాల మధ్య మత, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషికి నిదర్శనంగా ఈ అవార్డును అందించనున్నట్లు ఏప్రిల్‌లో యూఏఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును యుఏఈ జాతిపిత షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్మాన్ పేరిట ఇస్తారు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ అవార్డును మోదీకి ప్రకటించారు. అంతకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అందుకున్నారు. ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేయడం గర్వంగా ఉందని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. మిత్రులుగా ఉన్న రెండు దేశాల ప్రజల మధ్య కూడా సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన వల్ల ఇరు దేశాల దైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టవంతం అవుతాయని యూఏఈ పేర్కొంది.
చిత్రం...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ అవార్డును అందజేస్తున్న యూఏఈ సైనిక దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్