అంతర్జాతీయం

మధ్యవర్తిత్వానికి ట్రంప్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 23: భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు కోరితే కాశ్మీర్ అంశంపై సహకరించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్‌లోని ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. కాశ్మీర్ లోయలో పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా దృష్టి కేంద్రీకరించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు అయిదో తేదీన జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడంతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ‘అమెరికా కాశ్మీర్ లోయలో పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తోంది. మేము శాంతియుత పరిస్థితులు, సంయమనం కోసం పిలుపునిస్తూనే ఉన్నాం’ అని ట్రంప్ పాలనాయంత్రాంగంలోని ఒక సీనియర్ అధికారి గురువారం పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య విడిగా ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న తరుణంలో ఆ అధికారి ఈ ప్రకటన చేశారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని తొలగించడం తన అంతర్గత అంశమని భారత్ ఇప్పటికే అంతర్జాతీయ సమాజానికి స్పష్టంగా చెప్పింది. వాస్తవ పరిస్థితిని అంగీకరించాలని పాకిస్తాన్‌కు హితవు పలికింది. కాశ్మీర్‌లోని పరిణామాల ప్రభావం రీజియన్‌లో అస్థిరతను పెంచే అవకాశం ఉందని, అందువల్ల కాశ్మీర్‌లో పరిస్థితిపై ట్రంప్ తీవ్రంగా దృష్టి కేంద్రీకరించారని ఆ అధికారి తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి సహకరించాలని ఇరు దేశాలు కోరితే సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారని ఆయన చెప్పారు. అయితే, భారత్ నుంచి మధ్యవర్తిత్వం వహించవలసిందిగా లాంఛనంగా ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పేర్కొన్నారు.