జాతీయ వార్తలు

కూతురు ఏడ్చిందని.. ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఆగస్టు 21: త్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించి చట్టం చేసినప్పటికీ ‘తలాక్’ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో ‘ట్రిపుల్ తలాక్’ ఘటన చోటు చేసుకొంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కూతురు ఏడ్చిందని భార్యకు ‘ట్రిపుల్ తలాక్’ చెప్పి విడాకులు చెప్పిన వైనమిది. ‘ఆగస్టు నాలుగో తేదీ రాత్రి నా కూతురికి ఆరోగ్యం సరిగా లేక బాగా ఏడ్చింది. దీంతో తనకు నిద్రా భంగం కలిగిందని నా భర్త కోపగించాడు.. పిల్లను చంపేయమన్నాడు.. దాంతో మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. దీంతో మా మామ, మరిది కూడా మా దగ్గరికొచ్చి నన్ను, నా బిడ్డను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటివేశారు.. భర్త మూడుసార్లు తలాక్ అంటూ విడాకులు చెప్పాడు.. నన్ను తక్షణమే ఇక్కడి తీసుకుపోవాలని నా తల్లికి ఫోన్ చేసి చెప్పాడు’ అంటూ ఉజ్మా అన్సారీ (21) అనే ముస్లిం మహిళ సెంద్వా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మామ, మరిదిల సమక్షంలోనే తనకు భర్త విడాకులు చెప్పాడనీ.. దీంతో పాటు వరకట్నం కోసం కూడా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. సంఘటన ఇండోర్‌లో జరిగిన నేపథ్యంలో కేసును అక్కడికి బదిలీ చేసినట్లు బర్వానీ ఎస్పీ డీఆర్ తేనీవర్ చెప్పారు. అయితే, తనకు ఇంకా ఫిర్యాదు చేరలేదనీ.. రాగానే విచారణ ప్రారంభించనున్నట్లు రావోజీ పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ సునీల్ గుప్తా స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇటువంటి ఘటనలకు ఎవరైనా పాల్పడితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.