అంతర్జాతీయం

మండలి చొరవ భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 17: జమ్మూకాశ్మీర్ అంశంపై ఐరాస భద్రతా మండలిలో చర్చకు రావడంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. ఐరాస బాధ్యతాయుతంగా వ్యవహరించిందని శనివారం ఆయన స్పష్టం చేశారు. ‘ఐరాసలో ఉన్నతమైన విభాగం భద్రతామండలి. ఐదు దశాబ్దాల్లో ఇలాంటి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. కాశ్మీర్ అంశం అత్యంత తీవ్రమైంది. అలాగే ప్రాధాన్యతగలది. భద్రతా మండలి చొరవను హర్షిస్తున్నా’అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అత్యంత వివాదాస్పదమై కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చకు రావడం ముదావహం అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం న్యూయార్క్‌లోని ఐరాస భద్రతా మండలిలో కాశ్మీర్ అంశంపై అత్యవసర చర్చ జరిగింది. ఐరాసలో చర్చకు రావడం తమ విజయంగా పాకిస్తాన్ వెంటనే ప్రకటించుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ అంశంపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే 15 మంది సభ్యులున్న భద్రతా మండలిలో కాశ్మీర్‌పై చర్చించాలని చైనా సూచన మేరకు శుక్రవారం సమావేశం జరిగింది. సంస్థ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాత్రం మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ అంశం తమ అతర్గత వ్యవహారమని ఆయన తేల్చిచెప్పారు.