అంతర్జాతీయం

నేను ఓడిపోతే.. ఆర్థిక మాంద్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 17: అమెరికా ఆర్థిక మాంద్యం బారిన పడుతుందా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే మాంద్యం సంకేతాలు నిజమైనన్న భావన కలుగుతోంది. 2020 ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆర్థిక మాంద్యం తప్పదని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందినట్టు కనిపించారు.
ఓ వైపుఆర్థిక మాంద్యం తప్పదన్న సంకేతాలు, మరో వైపుదేశంలో అత్యల్ప ఉద్యోగిత రేటు ఆయనను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వృద్ధిరేటు పడిపోవడం సహా అనేక అంశాల్లో ట్రంప్‌పై ఓటర్లు అసంపూర్తిగా ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో 2020 ఎన్నికల్లో తిరిగి గెలుస్తామా?అన్న భయం అధికార పార్టీని వెన్నాడుతోంది. ఆర్థిక మాంద్యం తప్పదన్న సంకేతాలు మార్కెట్లు వ్యక్తం చేస్తున్నాయి. తాజా పరిణామాలు ఇనె్వస్టర్లు, కంపెనీలు, వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎన్నికల నాటికి పరిస్థితి చక్కబడకపోతే ఇబ్బందేనని ఆయన సలహాదారులు భయపడుతున్నారు. కొన్ని సంస్కరణలు చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారులు అంటున్నారు. కాగా ఫెడరల్ రిజర్వ్ సహా పలు ఆర్థిక సంస్థల పనితీరును ట్రంప్ నిందిస్తున్నారు. వడ్డీ రేట్లలో కోత విధించాలని ఆయన వత్తిడి చేస్తున్నారు. ఓ పక్క మార్కెట్‌లలో అనిశ్చిత పరిస్థితులుండగా, చైనా పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కీలక దేశాల్లో ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ఈ నేపథ్యంలో కొంత దూకుడు తగ్గించుకోవాలని అధ్యక్షడు ట్రంప్‌కు ఆయనకు అత్యంత సన్నిహితులైన కొందరు సలహా ఇస్తున్నారు. వాణిజ్య వివాదాలు, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. టారిఫ్‌లు పెంచుకుంటూ పోతే స్వదేశీ వినియోగదారులకే నష్టమని అది మార్కెట్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 2017లో అధ్యక్షుడు ట్రంప్ పన్ను విధింపునిర్ణయం రాజకీయంగా అనేక విమర్శలకు దారితీసింది. అధికార పార్టీ ప్రతినిధులూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినియోగదారులకు ప్రయోజనం, ఉపాధి కల్పనపై దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాలని వారు అంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితి దారిలోపడుతుందన్న ఆశాభావం అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రజలను ఆకట్టుకోవడం ఎలాగో అధ్యక్షుడు ట్రంప్‌కు తెలుసు. దేశాభివృద్ధికి, స్థానిక అంశాలపై పనిచేసింది తానే నన్న విశ్వాసంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. గురువారం న్యూ హంప్స్‌హైర్‌లో జరిగిన ఓ ర్యాలీలో అధ్యక్షుడు ప్రసంగిస్తూ ‘మీరు ఓటు అంటూ వేస్తే నాకే వేస్తారు. మీకు మరొక ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే దేశం కోసం ఎంతో చేశాను’అని ఆయన అన్నారు. ‘మీకు నా మీద ప్రేమ ఉన్నా లేకున్నా ఓటు మాత్రం నాకే వేస్తారు’అని న్యూజెర్సీ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఆర్థిక అంశాలు, గణాంకాలను మీడియా వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. తనపై పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని ట్రంప్ పేర్కొన్నట్టు వైట్‌హౌస్‌కు సన్నిహితంగా ఉండే ఇద్దరు రిపబ్లికన్లు వెల్లడించారు. ట్రంప్ బహిరంగంగా అనకుండా ప్రైవేటు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.
చిత్రం... అమెరికా అధ్యక్షుడు ట్రంప్