అంతర్జాతీయం

రాజ్‌నాథ్‌ది బాధ్యతారాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 17: అణ్వాయుధాలపై వినియోగంపై పరిస్థితులను బట్టి తన నిర్ణయం మారుతుందన్న భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మండిపడింది. రాజ్‌నాథ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, అత్యంత దురదృష్టకరం అని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్‌మూద్ ఖురేషీ విమర్శించారు. తనంతట తానుగా భారత్ అణ్వాయుధాలు వాడదని, పరిస్థితులను బట్టి నిర్ణయం మార్చుకోవల్సి వస్తుందని రాజ్‌నాథ్ చెప్పారు.
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణు పరీక్షలు జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పోఖ్రాన్‌లో పరీక్షలు జరిగాయి. అలాగే 1998లో వాజపేయి హయాంలోనూ మరోసారి పరీక్షలు నిర్వహించారు. రాజ్‌నాథ్ చేసిన ప్రకటనపై పాక్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘రాజ్‌నాథ్ ప్రకటన కయ్యానికి కాలుదువ్వేలా ఉంది. ఇది అత్యంత దురదృష్టకరం’అని ఖురేషీ ధ్వజమెత్తారు. ‘మేం ఎంతో సంయమనం పాటిస్తున్నాం. అయితే భారత్ ఇలాంటి ప్రకటనలు చేయడం దారుణం’అని ఆయన అన్నారు. భారత రక్షణ మంత్రి మూర్ఖత్వంతోనే ఆ ప్రకటన చేశారని ఖురేషీ విరుచుకుపడ్డారు. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన తరువాత భారత్-పాక మధ్య తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.