అంతర్జాతీయం

కరాచీ వెళ్లే థార్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన భారత్ రైల్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 16: పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్ళే థార్ ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే అధికారులు రద్దు చేశారు. ప్రతి శుక్రవారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి కరాచీకి థార్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళుతున్న సంగతి తెలిసిందే. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ పార్లమెం టు ఆమోదించడం, దానికి రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వే యడంతో, పాక్ మండిపడుతున్నది. 2008 సంవత్సరంలో జోధ్‌పూర్-కరాచీల మధ్య పునరుద్ధరించిన థార్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి వేస్తున్నట్లు పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఆగస్టు 9న ఇస్లామాబాద్‌లో ప్రకటించారు. ఆ రోజున 180 ప్రయాణికులతో జోథ్ పూర్ నుంచి కరాచీకి రైలు వెళ్ళింది. భారత్ నుంచి ఇదే చివరి రైలు అని షేక్ రషీద్ పేర్కొన్నారు. ఇలాఉండగా రాజస్థాన్, జోధ్‌పూర్ నుంచి కరాచీకి రైళ్ళ రాకపోకలను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు నార్త్-వెస్ట్రన్ రైల్వేల పౌర సంబంధాల ప్రధాన అధికారి (సీపీఆర్‌వో) అభయ్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ రైళ్ళను నిలిపి వేస్తున్నట్లు ఆయన తెలిపారు.