అంతర్జాతీయం

కాలగర్భంలో కలిసిపోనున్న జకార్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 16: ఇండోనేషియా రాజధాని జకార్తా మరికొనే్నళ్లలో కాలగర్భంలో కలసిపోనున్నది. పుడమిలో త్వరితగతిన మునిగిపోతున్న నగరాల్లో ఒకటిగా జకార్తా చరిత్రలో నిలువనుంది. ప్రస్తుతం ఎదురవుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితులు ఇదే రీతిన కొనసాగితే ఈ నగరంలోని మూడో వంతు భాగం 2050 నాటికల్లా అంతర్ధానం కానుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా నియంత్రణ లేకపోవడం, భూగర్భ జలాలు అధికంగా క్షీణించడం, సముద్రతీర ప్రాంతం స్థాయి పెరుగుతుండడం, అస్థిరమైన వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటి అంశాలు జకార్తా నగరం రానున్న కొనే్నళ్లలో చరిత్ర పుటల్లోంచి అదృశ్యం కావడానికి దోహదం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పర్యావరణపరంగా తీసుకోవాల్సిన చర్యల్లో కొంత ప్రభావం కనిపించడం వల్ల సంబంధిత అధికారులు ఇందుకు తగిన కార్యాచరణను అమలు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత దేశ రాజధాని జకార్తా మరికొనే్నళ్లలో మునిగిపోనున్న నేపథ్యంలో కొత్త రాజధానిని సత్వరమే గుర్తించాల్సిన అవసరం ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది. ‘మా దేశ రాజధాని బోర్నియో దీవుల్లో కలసిపోనున్నది’ అని ఇండోనేషియా నాయకుడు జొకొ విడొడొ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం జకార్తా నగరంలో 10 మిలియన్ మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ‘వరదలు వస్తున్నాయంటే మేము వణికిపోతున్నాం’ అని ఫుడ్ స్టాల్ యజమాని రషీద్ ఇక్కడ ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ వాపోయాడు. ‘2007లో సంభవించిన వరదల కారణంగా నా వ్యాపారానికి సంబంధించిన చాలా వస్తువులను పోగొట్టుకున్నాను. మళ్లీ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నాడు. తన ఇంటికి సమీపంలోని జకార్తాలో గల పశ్చిమ పోర్టులో భూభాగం దారుణంగా వరద నీటిలో మునిగిపోయిందని ఆయన అన్నాడు. భూకంపాలు సంభవించే ప్రాంతాలుగా గుర్తించిన ఏరియాల్లో నిర్మాణాలు చేపట్టడం, 13 నదుల సంగమం ప్రాంతాల్లోని బురద నేలల్లో సైతం పలు నిర్మాణాలు జరగడం, వీటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం, ట్రాఫిక్ భారీగా పెరగడం, పట్టణీకరణ పెరుగుదలలో తగిన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు నగరం వినాశనానికి దారితీసేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జకార్తా నగరంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఇప్పటికీ పైపుల ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో స్థానికంగా గల పరిశ్రమలు, మిలియన్ల మంది ప్రజలు జలాశయాలపై ఆధారపడుతున్నారు. భూగర్భ జలాల వెలికితీతకు చేపడుతున్న పనుల వల్ల భూమిపై అధిక భారం పడుతోంది. తద్వారా జకార్తా 25 సెంటీమీటర్లు (10 ఇంచీలు) వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కుంగిపోతోంది. ఇది సముద్ర తీర ప్రాంతాల్లో రెండింతల వరకు ప్రభావం చూపిస్తోందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. జకార్తా సముథ్రతీర ప్రాంతంలో కృత్రిమ దీవుల నిర్మాణాన్ని చేపట్టడం, సముద్ర తీర ప్రాంతమంతటా పెద్ద గోడ నిర్మాణాన్ని చేపట్టడం వంటి పనులకు ఎప్పుడో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ ప్రాజెక్టు అమలుకు 40 బిలియన్ డాలర్లు ఖర్చు కానున్నదని అంచనా వేశారు. అయితే, ఆయా పనులు చేపట్టినా గత కొనే్నళ్లుగా నగర పరిరక్షణకు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇపుడు సమస్యకు సరైన పరిష్కారం చూపబోదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సముద్ర తీరం వెంబడి గోడ నిర్మాణం నగరం మునిగిపోకుండా నివారించేందుకు శాశ్వత పరిష్కారం కాదని బ్యాండంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన భూగర్భ శాస్తవ్రేత్త హెరి ఆండ్రియాస్ అభిప్రాయపడ్డారు. వాటర్ మేనేజిమెంట్‌ను నియంత్రించడంమే తమ ముందున్న తదుపరి కర్తవ్యమని ఆయన అన్నారు.